తెలుగు సినిమా లో కొంతమంది దర్శక నిర్మాతలు ఈ మధ్యకాలంలో కమర్షియల్ సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టి కొంత మంది స్టార్ హీరోయిన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది. ప్రధానంగా కన్నడ హీరోయిన్ పూజా హెగ్డే విషయంలో కొంతమంది స్టార్ దర్శక నిర్మాతలు ఆసక్తికరంగా ఉండి ఆమె విషయంలో ఎక్కువ రెమ్యూనరేషన్ పెట్టడానికి కూడా సిద్ధం గా ఉంటున్నారు. ఇక పూజ తెలుగుతో పాటు తమిళం అదే విధంగా బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నం చేయడం అలాగే అక్కడ ఉన్న కొంతమంది దర్శక నిర్మాతలతో చర్చలు జరపడం వంటివి జరుగుతున్నాయి.

ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో సినిమాల విషయంలో కాస్త దూరంగా ఉండటమే కాకుండా బాలీవుడ్ సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టి అక్కడ కూడా పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తూ తెలుగు సినిమాలను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. అయితే తెలుగులో ఆమె ఇంకా పూర్తిస్థాయిలో హీరోయిన్గా నిలబడక పోయినా కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటు మాత్రం తెలుగు సినిమాలు ఇబ్బంది పెడుతోంది. చాలా వరకు కూడా స్టార్ హీరోలు ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న సరే ఆమె అనుసరిస్తున్న వైఖరి ఇబ్బందికరంగా మారింది అనేది చాలామంది మాట్లాడుతున్నారు.

బాలీవుడ్ లో ఒక రేంజ్ లో ఉన్నప్పుడు ఇతర భాషల మీద అంత తొందర పాటు ఎందుకని ప్రభాస్ తో చేసే సినిమా హిట్ అయితే మాత్రం అటు వెళ్తారా అంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమెకు బాలీవుడ్ లో మంచి ఆఫర్లు ఉన్నాయని కొంతమంది ప్రముఖ దర్శక నిర్మాతలతో ఆమెకు మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆమెను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని రెమ్యునరేషన్ విషయంలో కూడా కాస్త గట్టిగానే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుగులో కూడా ఎలాగో క్రేజ్ ఉంది కాబట్టి ఆమె విషయంలో కాస్త ఆసక్తికరంగా ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: