తెలుగు సినిమా లో ఈ మధ్య కాలంలో కన్నడ హీరోయిన్లు హవా ఎక్కువగా పెరిగింది అనే మాట వాస్తవం. ప్రధానంగా పూజాహెగ్డే అలాగే రష్మిక మందన ఇద్దరు కూడా తెలుగులో వరసగా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేయడం తెలుగు సినిమాల్లో కూడా వాళ్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పుడు కీర్తి సురేష్ వీళ్ళిద్దరికీ పోటిగా వస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో వీళ్లిద్దరు ఎదుర్కొంటారు అనేది కూడా చూడాలి.

ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో కాస్త మంచి అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా రష్మీక మందన కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల మీద దృష్టి పెట్టి ఆయా సినిమాలకు సంబంధించి కాస్త ఎక్కువగా కష్టపడి ప్రయత్నం చేస్తోంది. రష్మీక మందన కు సంబంధించి కొంత మంది నిర్మాతలు కూడా కాస్త ఆసక్తి చూపించటంతో ఈ మధ్యకాలంలో ఆమె రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని ప్రస్తుతం అల్లు అర్జున్తో చేస్తున్న పుష్ప అనే సినిమా విజయం సాధిస్తే మాత్రం కచ్చితంగా ఆమె భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు.

పూజ హెగ్డే అలాగే రష్మీక మందన ఇద్దరు కూడా తమ తమ సినిమాలకు దాదాపు ఐదు నుంచి ఏడు కోట్లు తీసుకుంటుండగా ప్రస్తుతం చేస్తున్న సినిమాలు విజయం సాధిస్తే మాత్రం కచ్చితంగా 10 కోట్ల వరకు డిమాండ్ చేసే అవకాశం ఉందని ఇతర భాషల్లో కూడా వీళ్ళకు డిమాండ్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. నటన విషయంలో పూజా హెగ్డే తో పోలిస్తే రష్మీక మందన కాస్త దూరంగా ఉండటమే కాకుండా ఏ పాత్ర అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆమె ఖచ్చితంగా రెమ్యూనరేషన్ భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయి అనేది కొంతమంది మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: