జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా తన సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం వరుసగా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేయడం ఈ నేపథ్యంలోనే కొంతమంది దర్శక నిర్మాతలు కూడా ఆయన విషయంలో మంచి కథను సిద్ధం చేసుకొని రెడీగా ఉండడం వంటివి జరుగుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దూకుడుగా సినిమాలు చేస్తూ కొత్త దర్శకులకు కూడా అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈ మధ్యకాలంలో ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఇక పవన్ సినిమాలో పెట్టుబడులు పెట్టడానికి కొంత మంది రాజకీయ నాయకులు కూడా ఆసక్తికరంగా ఉన్నారని ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సారథ్యం వహిస్తున్న జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ ఆయన సినిమాల్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

నాదెండ్ల మనోహర్ ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో కీలక నేతగా ఉండడమే కాకుండా పవన్ కళ్యాణ్ అన్ని విధాలా సహకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఒక ప్రముఖ దర్శకుడి తో చేసే సినిమాకు సంబంధించి పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయించేందుకు పవన్ కళ్యాణ్ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరంగా లేకపోయినా పవన్ కళ్యాణ్ ఓకే అంటే మాత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

నాదెండ్ల మనోహర్ ఈ సినిమాకు సంబంధించి దాదాపు 60 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని మరో నిర్మాత తో కలిసి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ఇప్పుడు ప్రధానంగా వినబడుతోంది. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ ఎంతకు కీలకంగా మారుతున్నారు పవన్ కళ్యాణ్ సినిమాకి పెట్టుబడి పెడతారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: