మాస్ మహరాజ రవితేజ..ఈ హీరోకి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తప్పులేదు. ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించిన రవితేజ..ఆ తరువాత తన టాలెంట్ తో చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ..ఫైనల్ గా హీరోగా సెటిల్ అయ్యారు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో మనల్ని ఎంటర్ టైన్ చేసిన ఈయన ఈ మధ్య కాలంలో సరైన్ హిట్ లేక వెనుక పడిపోయారు. కానీ ఈయనకు ఉన్న ఫాలోయింగ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. మాస్ క్యారెక్టర్లు పెట్టింది పేరు రవితేజ.

టాలీవుడ్ సినీ చరిత్రలో గుర్తుండిపోయే ఎన్నో సినిమాలో హీరో గా నటించిన రవితేజ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా "ఇడియట్".  ఓ చంటి గాడి ప్రేమ కధ అంటూ తెర పై కి వచ్చిన ఈ సినిమాలో రవితేజ నటన అధ్బుతం. ఈ సినిమాలో ఆయన చెప్పే డైలాగ్స్ ఇప్పటికి యువత కొన్ని సంధర్భాల్లో వాడుతుంటారు. అంతలా అట్రాక్ట్ చేసింది ఈ సినిమా. ఇక ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించారు . కానీ గత కొంత కాలం నుండి సరైన హిట్ లేక అల్లాడిపోతున్న రవితేజ కి "క్రాక్" సినిమాతో గోపీచంద్ మల్లినేని బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. దీంతో మళ్లీ ఆయన ఫాంలోకి వచ్చారు.

ఇప్పుడు ఆయన చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. అవే కాక ఇంకో రెండు సినిమాలు చర్చిస్తున్నారు.  ఇక రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి  సినిమాలో న‌టించే అవకాశం కూడా కొట్టేశాడు ఈ మాస్ హీరో.  బాబీ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ  సినిమాలో మాస్ మహారాజా రవితేజ్ కూడా ఓ కీల‌క పాత్ర‌ పోషిస్తున్నాడు. ఇందుకోసం ఆయన ఏకంగా 7కోట్లు తీసుకున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిజానికి మిగతా హీరోలతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ..కానీ రవితేజ మార్కెట్ తో పోలిస్తే ఇది ఎక్కువనే అంటున్నారు విశ్లేషకులు. మరి చూడాలి ఈ సినిమాతో రవితేజ మనల్ని ఎలా మెప్పిస్తాడో..?

మరింత సమాచారం తెలుసుకోండి: