మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉండగా ఈ సినిమా తోనే ఈ ఇద్దరు హీరోల పాన్ ఇండియా భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు.   ఈ చిత్రం విడుదల కాకముందే ఆయన శంకర్ దర్శకత్వంలోని సినిమా షూటింగ్ కు తీసుకు వెళ్ళాడు. భారీ స్థాయిలో ఆ చిత్రాన్ని మొదలు పెట్టిన రామ్ చరణ్ ఇప్పుడు దాదాపు సగభాగం షూటింగ్ పూర్తి చేశాడు అంటే అందరూ నమ్మాల్సిందే.

 శంకర్ కూడా గతంలో రోజులకు తరబడి షూటింగ్ చేయకుండా తొందరగా షూట్ అయ్యే విధంగా ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళుతున్నాడు. తన సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకునే దిల్ రాజు నిర్మాత కావడం ఈ సి ఏం చేస్తాడు అన్న సందిగ్దంలో ఉందట ఆనిమా ఎంత త్వరగా షూటింగ్ జరుపుకోవడానికి ముఖ్య కారణం అని అంటున్నారు. అయితే ఎన్ని పక్కాగా ప్లాన్ చేసిన కూడా శంకర్ గత సినిమాల్లో చేసిన పొరపాట్ల వల్ల ఈ చిత్రం పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా శంకర్ సినిమా కెరియర్ ఏమంత బాగోలేదు. తమిళనాడులో అయితే ఆయనకు ఏ హీరో కూడా అవకాశం ఇచ్చే సీన్ లేదు.
 
ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగు లో కి వచ్చి సినిమా చేస్తున్నాడు అనే టాక్ తమిళనాడులో కొనసాగుతుండగా తాజాగా ఆయన మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన సినిమా ఇండియన్ 2 సినిమా ను పూర్తిగా ఒత్తిడి పెరిగింది. ఈ సినిమా యొక్క నిర్మాతలు ఆ సినిమా ను పూర్తి చేయాల్సిందిగా కోరగా ఆ సినిమా చేస్తే బాగుంటుందన్న ఆలోచన కు వచ్చాడట శంకర్. కమల్ హాసన్ ఈ విషయంలో కొంత బలవంతపెట్టడంతో ఆయన మాట కాదనలేక ఆ చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది శంకర్. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ సినిమా పట్ల ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఉన్నపళంగా ఈ సినిమా ను ఆపేస్తే ఎలా అని మెగా అభిమానులు కలవరపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: