అక్కినేని నాగ చైతన్య ఇప్పటికే ఈ సంవత్సరం విడుదలైన లవ్ స్టోరీ సినిమా విజయం తో మంచి జోష్ లో ఉన్నాడు, ఈ సక్సెస్ జోష్ ను ఇలాగే కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశం తో నాగ చైతన్య కూడా వరుస క్రేజీ సినిమాల్లో నటిస్తున్నాడు.  అందులో భాగంగా నాగ చైతన్య 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా లో అక్కినేని నాగార్జున తో పాటు మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు, ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన నాగ చైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేయగా దీనికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా తో పాటు అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర లో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమా లో కూడా నాగ చైతన్య ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ సినిమా తో నాగ చైతన్య బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఇది ఇలా ఉంటే అక్కినేని నాగ చైతన్య ఈ రెండు సినిమాల కంటే ముందే విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో దిల్ రాజు బ్యానర్ లో థాంక్యూ అనే సినిమాను మొదలు పెట్టాడు, ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. అయితే గత కొన్ని రోజులుగా థాంక్యూ సినిమా ఓటిటి లో విడుదల కాబోతుంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి, అయితే తాజా గా థాంక్యూ సినిమా పై వస్తున్న రూమర్స్ మీద దిల్ రాజు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. థాంక్యూ సినిమా ను కచ్చితం గా థియేటర్ లొనే విడుదల చేస్తాము అని,  ఓటిటి లో విడుదల చేయమని, కొన్ని సినిమా లను థియేటర్ లలో చూస్తేనే మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది అని, అలాంటి ఎంజాయ్మెంట్ థాంక్యూ సినిమా ఇస్తుంది అని, అందుకే నాగ చైతన్య హీరో గా రాశి కన్నా హీరోయిన్ గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన థాంక్యూ సినిమాను థియేటర్ లోనే విడుదల చేస్తాము అంటూ దిల్ రాజు తెలియజేశాడు. ఇలా దిల్ రాజు థాంక్యూ సినిమా పై వస్తున్న రూమర్స్ కు పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: