ప్రభాస్ ఏ నిమిషాన రాధేశ్యామ్ చిత్రాన్ని మొదలుపెట్టాడో కానీ మొదటి నుంచి ఈ చిత్రానికి అడ్డంకులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. మొదటినుంచి ఈ సినిమా షూటింగ్ కూడా సక్రమంగా జరగలేదు. ఒక దాని తర్వాత ఒకటి కారణాలు రావడం వల్ల ఈ చిత్రం దిన దిన గండంగానే పూర్తయింది. పోనీ ఇప్పుడు షూటింగ్ పూర్తయింది ఇక విడుదలై విజయం అందుకోవడమే తరువాయి అని భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సరికొత్త వాదన తెలుగు సినిమా పరిశ్రమలో ఈ రాధే శ్యామ్ సినిమా గురించి మొదలవుతుంది. మరి ఆ సమస్య ఏంటి అందరినీ కలవరపెడుతున్న విషయం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

రాధాకృష్ణ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా వివిధ భాషలలో విడుదలవుతూ అలరించడానికి జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటించిన సాహో సినిమా విడుదలై మూడు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో చాలా రోజుల తర్వాత విడుదలవుతున్న ఈ సినిమాను చూడాలని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. మేకింగ్ టైం లో సరైన అప్డేట్లు ఇవ్వకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురి కాగా అప్పుడు ఈ సినిమాకు ఆశించినంత బజ్ కూడా రాలేదనే చెప్పాలి.

అయితే రిలీజ్ దగ్గర పడుతుండడంతో సినిమాకు సంబంధించిన అప్డేట్లు విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్ అందరు కూడా ఈ సినిమా పై హైప్ క్రియేట్ చేసే విధంగా ముందుకు వెళుతున్నారు. వరుసగా పాటలను విడుదల చేస్తూ పాజిటిటిని పెంచుతున్నారు. దక్షిణాదిన మరియు హిందీ లో డిఫరెంట్ డిఫరెంట్ గా పాటలను విడుదల చేసి ఆయా ప్రాంతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే బాలీవుడ్ సినిమా విషయంలో మాత్రం ఆశికి సినిమా లాగా పాటలు ఉంటున్నాయని అక్కడి ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇది సినిమాపై భారీగా ఎఫెక్ట్ చూపించబోతోంది అని అంటున్నారు. బేసిగ్గా రాధే శ్యామ్ తెలుగు సినిమా కావడంతో పాటలు విన్న తర్వాత అది తెలుగు సినిమాలాఅనిపించడం లేదు అని సౌత్ వారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: