మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలలో ఓ సినిమా బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా. వాల్తేరు వీరన్న అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. టాలీవుడ్ లో రచయితగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాబీ తొలి సారి పవర్ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. రవితేజ కెరీర్ లోనే ఈ సినిమా స్పెషల్ సినిమా గా మిగిలింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో జైలవకుశ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాలోలు చేసి అగ్ర దర్శకుడిగా మారాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తనకొచ్చిన ఎక్స్పీరియన్స్ తో మెగా స్టార్ చిరంజీవికి మంచి కథ రాసి ఆయనను ఒప్పించారు. 

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి మూడు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి చిత్రాలను ఇప్పటికే మొదలుపెట్టి షూటింగ్ పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి తొందర్లోనే బాబీ దర్శకత్వంలోని సినిమాను కూడా కూడా మొదలుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమా తో సహా నాలుగు సినిమాలు సిద్ధం అవుతున్నాయి. ఈ విషయం మెగా అభిమానులను సంతోష పెడుతుంది. తాజాగా బాబీ సినిమా యొక్క కథ ఇదే నంటూ సోషల్ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. 

అయితే ఇప్పుడు అభిమానులకు పూనకాలు వచ్చే మాట ఏమిటంటే ఈ చిత్రంలో చిరు చేసే పాత్ర తీరుతెన్నులు కూడా ఇవేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం అవుతోంది. ఈ సినిమాలో చిరు పాత్ర ముఠామేస్త్రి తరహాలో ఉండబోతుందని, గెటప్ కూడా ఆ విధంగానే ఉంటుందని అంటున్నారు. పోర్టు లో పనిచేసే కూలీ పాత్ర చేస్తున్నాడని అంటున్నారు  అయితే పాత్ర ఎలా ఉన్నప్పటికీ అంతరంగంగా వేరే లక్ష్యం ఉంటుందట. అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అని కూడా చెబుతున్నారు. పోలీస్ అవతారంలో కనిపిస్తాడని సెకండాఫ్ మొత్తం అలానే దర్శనం ఇస్తున్నాడు అంటున్నారు. ఇదే సినిమాకు హైలెట్ అవుతుందని అంటున్నారు.దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: