అయితే ఈ భేటీ వెనుక ప్రధాన కారణం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ భవనం అనేది చాలా మంది మాట్లాడే మాట. ఈ భవనాలకు సంబంధించి బాలకృష్ణ సానుకూలంగా ఉన్నారని దాదాపుగా ఆయన కోటి రూపాయలు విరాళం ఇచ్చే అవకాశం ఉందని 2 భవనాలను నిర్మించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతమంది సినీ కార్మికులకు పెన్షన్ ఇప్పించే విధంగా కూడా బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే ఆయన మంచు విష్ణుతో కలిసి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేకపోయినా త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉండవచ్చు. బాలకృష్ణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత కొన్ని కొన్ని అంశాలు ఎక్కువగా జోక్యం చేసుకోవడం అలాగే మంచు విష్ణుకి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం వంటివి జరుగుతున్నాయి. అయితే బాలకృష్ణ ఇప్పుడు భేటీ అవుతారని ఏంటనే దానిపై ఇంకా ఇటువంటి క్లారిటీ లేకపోయినా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ కు బాలకృష్ణ ఫోన్ కూడా చేసి మాట్లాడారు అని సమాచారం.