సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలి అంటే ..అందం ఒక్కటే ఉంటే సరిపోదు..దానితో పాటు కష్ట పడే తత్వం కూడా ఉండాలి. అప్పుడే వాళ్లు అనుకున్న పోజీషన్ కి వెళ్లగలరు. అలా అందంతో పాటు కష్ట పడే తత్వం ఉన్న హీరోయిన్స్ కూడా కొన్ని సార్లు ఇండస్ట్రీలో నెట్టుకురాలేకపోయారు. దానికి కారణం అదృష్టం. మనం ఎంత కష్టపడిన మనకంటు లక్ లేకపోతే.. ఆ కష్టానికి ఫలితం ఉండదు. అలా అదృష్టాని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ నే " కృతి శెట్టి".

ఈమె ఇప్పటి వరకు తెలుగులో నటించింది  ఒక్కటి అంటే ఒక్కటే సినిమా. కానీ, ఈమెకు ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ టాప్ హీరోయిన్ లకు కూడా లేదు అనే చెప్పాలి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరో నటించిన "ఉప్పెన" సినిమా ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ .. ఇప్పుడు డైరెక్టర్, ప్రోడ్యూసర్స్ పాలిట అదృష్ట దేవతగా మారిపోయింది. ఓవన్ నైట్ లో స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోయిన ఈ అమ్మడు చేతిలో  ప్రస్తుతం ఆరు బడా సినిమాలు ఉన్నాయి.  నానీతో ‘శ్యామ్‌ సింగరాయ్‌'..నాగచైతన్య "బంగార్రాజు"..ఇలా స్టార్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేసి  దూకుపోతుంది.

రీసెంట్ గా అమ్మడు ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమా కి సంతకం చేసిన్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి. ఇది నిజంగా షాకింగ్ విషయమే. ఎందుకంటే సాధారణంగా లేడీ ఓరియంటెడ్‌ సినిమా అవకాశాలు రావలంటే ఓ పది సినిమా లైన చేసి ఉండాలి కానీ కృతి ఒక్క సినిమాకే ఇలాంటి ఆఫర్ కొట్టేసింది  అంటే గ్రేట్ అంటున్నారు అభిమానులు. కాగా ఈ సినిమాని విరించి వర్మ  దర్శకత్వం వహిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ఈ సినిమాని నిర్మించబోతున్నారట. ఏది ఏమైన వరుస సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతున్న కృతి కి కొంచెం తొందర ఎక్కువే అంటున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: