తెలుగు చిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఆయన తన కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. తన హార్డ్‌వర్క్‌తో ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు. అల్లు అర్జున్ సినీ జీవితానికి బ్రేక్ పడిన సినిమా ఏది అంటే అది ఖచ్చితంగా ‘దేశముదురు’ అనే చెప్పాలి మరి. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిత్రీకరించారు. బన్నీ కెరీర్‌లో అత్యధిక కేంద్రాల్లో శత దినోత్సవం చూసిన సినిమా గాను, ఆయన నట జీవితంలో డైరెక్ట్‌గా సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఏకైన సినిమాగా దేశముదురు రికార్డ్ సొంతం చేసుకుంది.

అంతేకాదు.. అప్పట్లో బన్నీకి యూత్‌లో అంతగా ఫాలోయింగ్ లేదు.. దేశముదురు సినిమా తర్వాత మాస్ ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ పెరిగింది. అయితే దేశముదురు సినిమాను 2007 జనవరి 12న విడుదల అయ్యి.. సంక్రాంతికి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య తమ యూనివర్సల్ మీడియా పతాకంపై భగవాన్ జె సమర్పణలో తెరకెక్కించారు.

కాగా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా హన్సిక మోత్వానీ తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఇక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించి వరుస అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రానికి  కథ మాటలు స్క్రీన్ ప్లే పూరీ జగన్నాథ్ అందించగా.. చక్రి సంగీతం సమర్పించారు. అలాగే ఈ సినిమా విజయంలో పాటలు కూడా కీలక పాత్ర పోషించాయనే  చెప్పాలి మరి. ఇక అప్పట్లో 400 థియేటర్‌లలో విడుదల అయినా బన్నీ మొదటి చిత్రం ఇదే.

అంతేకాక.. వందకు పైగా థియేటర్‌లలో శత దినోత్సవం చూసిన ఈ సినిమా హైదరాబాద్ 70 ఎమ్‌ఎమ్‌లో నృగ రజతోత్సవం పూర్తి చేసుకుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించి యూత్‌ను ఆకట్టుకున్నారు. ఒక్క విధంగా చెప్పాలంటే.. బన్నీ సినీ కెరీర్‌లో ఈ సినిమా మైలు రాయిగా నిలిచి పోయిందనే చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: