క్రికెటర్స్ మేము బ్యాటు, బాల్ నే కాదు సినిమా డైలాగులు కూడా చెబుతాము..అంటూ రోజుకో ఆటగాడు డైలాగులు చెప్పిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఇలా సినిమా డైలాగులు చెప్పి బాగా ఫెమస్ అయ్యారు.సోషల్ మీడియా పుణ్యమా అని ఏ చిన్న వార్త అయినా సరే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అందులోనూ డైలాగ్స్, సాంగ్స్ వాటికి నెటిజన్లు చేసే హంగామా మాములుగా లేదని చెప్పాలి.


సెలబ్రెటీలను సెలబ్రిటీలే ప్రమోట్ చేస్తే ఆ రచ్చ ఎలా ఉంటుందో తెలిసిందే కదా.. పాపులర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గతకొద్ది కాలంగా తెలుగు సినిమాల పాటలు, డైలాగులకు రీల్స్ చేసి అదరగొట్టారు. 'అల..వైకుంఠపురములో' సినిమాలోని 'బుట్టబొమ్మ' పాటకు డేవిడ్ భార్యతో పాటు చిందులేస్తే ఆ వీడియో బాగా వైరల్ అవుతూన్నాయి..చాలామంది సెలబ్రిటీలు ఈ పాటకు రీల్స్ చేశారు. డేవిడ్ 'పుష్ప' రీల్ కూడా చేస్తే బాగా వైరల్ అయింది. 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యేలా ప్రమోట్ చేస్తున్నందుకు డైరెక్టర్ వెంకీ కుడుముల స్టేజ్ మీద డేవిడ్ వార్నర్‌కి థ్యాంక్స్ కూడా చెప్పారు.


ఇది ఇలా ఉండగా.. పుష్ప అంటే ఫ్లవరనుకుంటివా.. ఫైరు' అంటూ ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. అచ్చు అల్లు అర్జున్‌ మాదిరిగానే 'పుష్ప రాజ్' లా తయారయ్యి, నోట్లో బీడీ పెట్టుకుని డైలాగ్‌తో జడేజా షేర్ చేసిన పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకుముందు 'పుష్ప' లో 'తగ్గేదే లే' డైలాగ్ చెప్పిన జడేజా ఇప్పుడు ఏకంగా 'పుష్ప రాజ్' గెటప్‌లోకి మారిపోయాడు. అంతేకాదు, జడేజా 'పుష్ప రాజ్' గెటప్‌లో ఉన్న పిక్‌నే తన ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ప్రొఫైల్ ను  కూడా పెట్టుకోవడం విశేషం.నిన్న శిఖర్ దావన్ కూడా పుష్ప డ్తెలాగును చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కోడుతుంది.. ఇప్పుడు ఇది కూడా..త్వరలోనే పుష్ప 2 సెట్స్ మీదకు వెల్లనుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: