సాధారణంగా కొన్ని సినిమాలోని పాటలు ప్రేక్షకులను తెగ నచ్చేస్తూ ఉంటాయ్. దీంతో సినిమా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయా పాటలు ఎప్పుడు ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉంటాయి. ఇక ఇటీవల కాలంలో ఇలా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయ్ పుష్ప సినిమాలోని పాటలు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా అదిరిపోయే విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అయితే ఈ సినిమాలోని ప్రతి పాటా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. సమంత నటించిన ఐటెం సాంగ్ ఊ అంటావా ఉహూ అంటావా అనే పాట అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఆ తర్వాత నా సామి అనే పాట కూడా ఎంతో మందిని ఆకర్షిస్తోంది. ఈ పాటపై ఎంతమంది డాన్స్ లు చేసి సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేస్తూ ఫేమస్ అయిపోవడం కూడా చేస్తున్నారు.



 అయితే పుష్ప సినిమాలో నా సామి అనే పాట పై అటు రష్మిక మందన చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎంతో క్యూట్ గా కనిపించిన రష్మిక మందన తనలో ఉన్న డాన్స్ టాలెంట్ ని కూడా అందరికీ చూపించింది. ఇక ఈ పాట చూసినప్పుడు రష్మిక కంటే బాగా ఈ పాటపై ఎవరు డాన్స్ చేయలేరు అనిపిస్తూ ఉంటుంది.. ఇక్కడ ఒక పర్ఫామెన్స్ చూస్తే మాత్రం రష్మిక కాదు అంతకు మించి అనే రేంజ్ లో డాన్స్ చేసింది ఏంటి అంటూ ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం డాన్స్ కు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతుంది టీవీలో ప్రసారమయ్యే ఢీ కార్యక్రమం. ఇందులో ఎంతో మంది కంటెస్టెంట్స్ పుష్ప సినిమాలోని పాటల పై డాన్స్ చేస్తున్నారు.



 ఈ క్రమంలోనే ఇక వచ్చే వారం ఎపిసోడ్ కు సంబంధించి ఇటీవలే ఢీ ప్రోమో విడుదలై వైరల్ గా మారిపోయింది. ప్రోమో లో భాగంగా పుష్ప సినిమా లోని నా సామి అనే పాట పై ఒక కంటెస్టెంట్స్ అద్భుతమైన పర్ఫామెన్స్ చేస్తోంది. ఈ పర్ఫామెన్స్ చూస్తున్న ప్రేక్షకులకు అరే ఎంత బాగా చేస్తుంది సూపర్ సూపర్ అంటూ అనిపిస్తూ ఉంది. ఇక ఈ పర్ఫామెన్స్  తర్వాత జడ్జిగా ఉన్న జానీ మాస్టర్ కూడా ఫిదా అయిపోయాడు. పర్ఫామెన్స్ డైరెక్టర్లు చూసారంటే నువ్వు 70 ఎం ఎం స్క్రీన్ మీద కనిపిస్తావ్ అంటూ ప్రశంసిస్తాడు జానీ మాస్టర్. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రోమోలో ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు కూడా ఓసారి చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: