అధికారికంగా ఆంధ్రా,తెలంగాణ విడిపోయి ఏడున్న‌రేళ్లు దాటిపోయింది.ఎవ‌రి జీవితాల్లో వారున్నారు.ఎవ‌రి రాష్ట్రాన్ని వారు బాగు చేసుకుంటున్నారు.ఎవ‌రి ప‌న్నులు వారివి.ఎవ‌రి పాల‌న వారిది.కొంచెం నీళ్ల విష‌య‌మై త‌గాదాలు న‌డుస్తున్నా కూడా వ‌ర్షాలు స‌మృద్ధిగా కురిసాయి క‌నుక ఈసారి ఆ అవ‌కాశం కూడా లేకుండా పోయింది.ఇక విద్యుత్ బిల్లుల బ‌కాయిలు మాత్రం తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సి ఉన్నాయి.ఇవి త‌ప్ప పెద్ద‌గా రెండు రాష్ట్రాల‌కు త‌గువులు లేనేలేవు.ఆ మాట‌కు వ‌స్తే ఉమ్మడి రాజ‌ధానిని ఎప్పుడో వ‌దిలేశారు చంద్ర‌బాబు.అదే కోవ‌లో జ‌గ‌న్ కూడా ఉమ్మ‌డి రాజ‌ధానిలో ఆంధ్రుల ఆస్తుల లెక్క తేల్చ‌కుండానే కొన్ని భ‌వనాలు అప్ప‌గించి వ‌చ్చేశారు. దీంతో ఇప్ప‌టికిప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య పెద్ద పెద్ద గొడ‌వ‌లేం జ‌రిగే వీలేలేదు.

కానీ సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల త‌గ్గింపు పై మాత్రం రేగుతున్న వివాదంపై తాను ఏపీ మంత్రుల‌తో మాట్లాడతాన‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ తెలిపారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. ఆంధ్రావివాదంలో తెలంగాణ మంత్రి ఎందుకని త‌ల‌దూర్చ‌డం అని కూడా అంటున్నారు కొంద‌రు.ఇదేం ప‌ద్ధ‌తి కాద‌ని ప్ర‌శ్నిస్తున్నారు ఇంకొందరు.ఎందుకంటే మంత్రి త‌లసాని చెప్పినంత మాత్రాన స‌మ‌స్య ప‌రిష్కారం అయిపోతుంద‌ని తాము అనుకోవ‌డం లేదని కూడా వాళ్లంతా అభిప్రాయ‌ప‌డుతున్నారు.అయినా ఇక్క‌డి మంత్రులు, ఇక్క‌డి వ్య‌వ‌హారాలు అన్న‌వి ఇక్క‌డివారితోనే తేల్చుకోవాలి కానీ తెలంగాణ నేత‌లు వ‌చ్చి పంచాయితీ పెట్ట‌డంఎందుక‌ని?



దీని వ‌ల్ల ఉభ‌య రాష్ట్రాల‌కూ మంచి జ‌రిగితే ప‌ర్లేదు కానీ రేప‌టి వేళ ఇబ్బందులు ఎదురైతే ఎవ‌రు ప‌రిష్క‌రిస్తారు ? అన్న ప్ర‌శ్న కూడా వ్య‌క్తం అవుతోంది.ఈ నేప‌థ్యంలో త‌ల‌సాని వ‌చ్చి మాట్లాడ‌తారా? లేదా వివాదాల‌ను దృష్టిలో ఉంచుకుని సైడ్ అయిపోతారా అన్న‌ది ఓ పెద్ద సందేహంగానే ఉంది ఇప్పుడు.వాస్త‌వానికి సినిమా వాళ్లంతా ప‌న్నులు ఎక్కువ స్థాయిలో చెల్లిస్తున్న‌దీ, షూటింగ్ లు చేస్తున్న‌దీ తెలంగాణ‌లోనే క‌దా! అన్న అక్క‌సుతో ఊగిపోతున్న ఆంధ్రా నాయ‌కుల‌కు ఇప్పుడీ వివాదం మ‌రింత ఆగ్ర‌హం తెప్పించేందుకు అవ‌కాశం ఉంది. ఈ త‌రుణంలో ఏపీలో ప‌రిణామాలు ఏవిధంగా మారున్నాయో అన్న‌దిక అత్యంత ఆస‌క్తిదాయ‌కం.



మరింత సమాచారం తెలుసుకోండి:

trs