టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బంగార్రాజు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించగా మరో ముఖ్య పాత్రలో నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని  ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాలు నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నారు.

 అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్రం బృందం ప్రమోషన్ ల స్పీడ్ పెంచింది. అందులో భాగంగా ఇది బృందం గత కొన్ని రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించింది. అందులో భాగంగా  ప్రస్తుతం ఉన్న టికెట్లపై నాగార్జున స్పందించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నాగార్జున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టికెట్ రేట్లు మా సినిమాకు సరిపోతాయి అని, టికెట్ రేట్ల వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని వ్యాఖ్యలు చేశాడు. అయితే నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత దుమారాన్నే రేపాయో మన అందరికీ తెలిసిందే. అయితే నాగార్జున చేసిన వ్యాఖ్యలపై తాజాగా నాగ చైతన్య స్పందించాడు. పోయిన సంవత్సరం ఏప్రిల్ 9న జీవో వచ్చింది.. మా సినిమా ఆగస్ట్ లో మొదలైంది . మేము ఆ టికెట్ రేట్ల ప్రకారమే బడ్జెట్ ను వేసుకున్నాం. అందువలన మాకు ఎలాంటి సమస్య లేదు. అవి పెరిగితే మా సినిమాకు ఇంకా బోన్ అవుతుంది అని నాగ చైతన్య తెలియజేశాడు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: