అందాల ముద్దుగుమ్మ ప్రియమణి ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా తర్వాత జగపతి బాబు హీరోగా తెరకెక్కిన పెళ్లయిన కొత్తలో సినిమా తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యమదొంగ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని టాలీవుడ్ లో తన క్రేజ్ విపరీతంగా పెంచుకుంది. ఇలా యమదొంగ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అనేక టాలీవుడ్ సినిమాలలో నటించి నటిగా తన రేంజ్ ను పెంచుకుంది.

 ప్రియమణి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషా సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ప్రియమణి కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లతో,  టీవీ షో లతో కూడా ప్రేక్షకులను అలరించింది. ప్రియమణి ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ ద్వారా ఇండియా రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ భామాకలాపం అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది. అభిమన్యు తాడిమేటి కథ, దర్వకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో ప్రియమణి టైటిల్ రోల్ లో కనిపించబోతుంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా విడుదల అయిన ఈ పోస్టర్‌లో ప్రియమణి ఎనిమిది చేతుల్లో ఎనిమిది రకాల పరికరాలు పట్టుకుని ఆకట్టుకుంటోంది. గృహిణిగా ఇంటి బాధ్యతలు నెరవేరుస్తూనే తనకు ఎదురైన ఇబ్బందులను ఎలా ఎదుర్కుందో ఈ వెబ్ సిరీస్ ద్వారా చూపించని ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: