మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆచార్య. కొరటాల శివ తీస్తున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మెగాస్టార్ ఆచార్య అనే నక్సలైట్ పాత్ర చేస్తుండగా ఆయనకి అనుచరుడిగా సిద్ద పాత్ర చేస్తున్నారు చరణ్. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి తిరు ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తుండగా సోను సూద్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ చిరు, చరణ్ టీజర్స్ తో పాటు సాంగ్స్ కి కూడా అందరి నుండి మంచి స్పందన లభించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో సిద్ద గా నటిస్తున్న రామ్ చరణ్ పాత్ర సినిమాలో చనిపోతుందని అంటున్నారు. సినిమాలో రామ్ చరణ్ పాత్ర దాదాపుగా ఇరవై ఐదు నిమిషాలకు పైగా ఉంటుందని, అయితే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర చనిపోతేనే కథ ప్రకారం ముందుకు నడుస్తుందని సమాచారం.

అయితే తొలిసారిగా మెగాస్టార్ మెగాపవర్ స్టార్ చేస్తున్న సినిమా కావడంతో ఇందులో చరణ్ క్యారెక్టర్ నిజంగానే చనిపోతే ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒకింత ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ అది ఫ్యాన్స్, ప్రేక్షకులు సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే ఫలితం పై అది కొంత ప్రభావం కూడా చూపే ఛాన్స్ లేకపోలేదు అంటున్నారు. అయితే స్క్రిప్ట్ ప్రకారం దర్శకుడు కొరటాల శివ రాసుకున్న ఈ సిద్ద పాత్ర అదిరిపోవడంతో పాటు ఆ పాత్ర ప్రేక్షకాభిమానులు మనసులో నిలిచిపోతుందని ఇన్నర్ వర్గాల టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: