టాలీవుడ్ సినిమా పరిశ్రమ మొత్తం ఇప్పుడు కమర్షియల్ మంత్రం చుట్టే తిరుగుతుంది. ప్రతి ఒక్క హీరో కూడా కమర్షియల్ సినిమాలు చేసి హీరోగా ఎదగాలనీ చూసేవాడే. ఎవరు కూడా ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఆఖరికి యంగ్ హీరోలు కూడా నాలుగు ఫైట్లు మూడు పాటలు రెండు ముద్దులు ఉన్న సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మరి సీనియర్ హీరోలు స్టార్ హీరోలు చేయలేనిది యంగ్ హీరోలు కూడా చేయలేక పోతే ఆ సినిమాలు ఎలా అనేది ఇప్పుడు సినిమా అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్న. 

ఏదైనా నటుడు నటుడిగా ఎదగాలంటే ఎవరైనా హీరో వైవిధ్యభరితమైన హీరోగా పేరు తెచ్చుకోవాలంటే తప్పకుండా కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక సినిమాలను కూడా చేయాలి. అన్ని సినిమాలలో హీరో సూపర్ మాన్ కాదు కొన్ని సినిమాలలో హీరో బలహీనుడిగా కూడా కనిపించాలి. తనలోని లోపాలను కూడా ప్రపంచానికి చాటి చెప్పాలి. అప్పుడే నటుడిగా ఆయన సంపూర్ణ నటుడిని అవతారం ఎత్తినట్లు. ఆ విధమైన పాత్ర లు గతంలో మన హీరోలు కొంతవరకు చేసే ప్రయత్నం చేశారు కానీ ఇటీవల కాలంలో మన హీరోలు ఏ మాత్రం కూడా ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదు.

కొడితే గాల్లోకి ఎగరడం, స్టెప్పేస్తే దుమ్ము లేచి పోవడం హీరోయిన్ పిలవగానే రావడం ఇవన్నీ కమర్షియల్ హీరో కి ఉండే లక్షణాలు. కానీ కమర్షియల్ హీరోగానే కాకుండా అన్ని రకాల కోణాలలో తమ నటనను చూపిస్తే తప్పకుండా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుందనే విషయాన్ని మర్చిపోయి యంగ్ హీరోలు సైతం ఆ విధంగా సినిమాలు చేయడం మానేశారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఈ రకమైన సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోయి యంగ్ హీరోలు ఏవేవో చేస్తున్నారు. స్టార్స్ అయ్యాక కూడా ఈ సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదు. కాబట్టి యంగ్ హీరో లు ఇప్పుడే తమ ఈ పద్ధతిని మార్చుకుని ప్రయోగాత్మక సినిమాల జోలికి వెళితే మంచిది అని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: