ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు జగపతిబాబు. ఆ రోజుల్లో పెద్ద హీరోలకు పోటీగా ఆయన సినిమాలు ఉండేవి. పండుగ సందర్భంలో ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే పెద్ద హీరోయిన్ లు సైతం వెనకడుగు వేసేవారు. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువగా వచ్చే జగపతిబాబు సినిమా వస్తుందంటే ఏ హీరో కూడా ఆ సినిమాకు ఎదురు వెళ్లేవారు కాదు. అలాంటి జగపతిబాబు ఆ తర్వాత కాలంలో తన ప్రాభవాన్ని చూపించుకో లేకపోయాడు. 

తనకు వచ్చిన క్రేజ్ ను కాపాడుకోలేక పోయాడు. మంచి సినిమాలను ఎంపిక చేసుకున్న కూడా తన వయసుకు తగ్గ తన ఇమేజ్ కు తగ్గ తన క్యారెక్టర్ కు తగ్గ సినిమాలు ఎంచుకోకపోవడం వల్ల తొందరగా ఆయన కెరీర్ ముగిసిపోయే విధంగా పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటారు. అలా ఆయన కెరియర్ ప్రమాదపు అంచుల్లో ఉన్న నేపథ్యంలో తొందర్లోనే రిటైర్మెంట్ ప్రకటించాలి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో విలన్ గా ఇచ్చి ఆయన తన లైఫ్ నే మార్చుకున్నాడు. హీరోగా రాని పాపులారిటీ ఆయనకు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

లెజెండ్ సినిమాతో విలన్ గా మారిన తర్వాత జగపతిబాబు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ప్రతి సినిమాలో కూడా ఆయనను విలన్ గా ఎంచుకునేవారు మన దర్శక నిర్మాతలు. ఆయన విలన్ గా చేసిన సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో పాటు జగపతి బాబు కు మంచి పేరు రావడంతో ఆయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇతర భాషలలో కూడా ఆయనను సెలెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ విధంగా జగపతి బాబు ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండగా తాజాగా ఆయన ఒకప్పుడు పడిన పాత్రలు పడట్లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విమర్శల నుంచి జగపతిబాబు ను కాపాడే పాత్ర ఇటీవలకాలంలో నిజంగానే రాలేదు అని చెప్పాలి. మరి భవిష్యత్ సినిమాలలో జగపతిబాబు కు లెజెండ్ లాంటి పాత్ర వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: