సినిమా పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా తన కెరీర్ మొదట్లోనే మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించాలి వారిని అభిమానులుగా మార్చుకోవాలి లేదంటే లాంగ్ రన్ లో వారు ప్రేక్షకులకు బోర్ కొట్టే ప్రమాదం ఉంది. అందుకే వారు చేసే తొలి నాలుగైదు సినిమాలతోనే సూపర్ హిట్ సాధించి ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకోవాలి. ఆ విధంగా కొంతమంది హీరోలు ఒకటి రెండు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పుడు స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు. అలా స్టార్ హీరోగా ఎదిగిన హీరోల గురించి వారి కెరియర్ లోని స్పెషల్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి చిత్రం ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేరు. ఒక విజయ్ దేవరకొండ కే కాదు టాలీవుడ్ సినిమా పరిశ్రమకే వన్నె తీసుకు వచ్చిన సినిమా ఇది. ఇలాంటి సినిమా ఐదు దశాబ్దాలకు ఒకసారి వస్తుంది అని విశ్లేషకులు చెప్పే మాట. ఈ సినిమా సక్సెస్ ను చూసింది అనే విషయం పక్కనపెడితే ఎంత మంది స్టార్ హీరోలకు ఎన్నో సినిమా లు చేస్తే వచ్చే భవిష్యత్తును ఈ ఒక సినిమా తో విజయ్ దేవరకొండ సొంతం చేసుకున్నాడని చెప్పొచ్చు. అంతలా ఆయన క్రేజ్ అందుకున్నాడు ఈ సినిమా తో. 

ఇక టాలీవుడ్ సినిమా పరిశ్రమలో భారీ క్రేజ్ అందుకున్న మరొక హీరో నవీన్ పోలిశెట్టి. జాతిరత్నాలు సినిమా చేయడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు అని చెప్పొచ్చు. ఆ సినిమా తో మంచి ఇమేజ్ అందుకున్నాడని చెప్పవచ్చు. ఆ తరువాత తెలుగు సినిమా పరిశ్రమలోకి తారాజువ్వల దూసుకు వచ్చాడు హీరో కార్తికేయ. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం ఆర్ఎక్స్ 100 చిత్రం సూపర్ హిట్ కాగా తొలి సినిమాతోనే క్రేజ్ అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక వైష్ణవ్ తేజ్ కూడా ఉప్పెన సినిమాతో మంచి హిట్ అందుకునే హీరోగా నిలదొక్కుకున్నాడు. ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా తో కిరణ్ అబ్బావరం కూడా స్టార్ హీరో గా మారాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: