స్టార్ హీరో బాలకృష్ణ అఖండ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఏపీలో టికెట్ రేట్లు తగ్గకుండా ఉండి ఉంటే అఖండ 85 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించి ఉండేదని బాలయ్య అభిమానులు అనుకుంటున్నారు..

తెలుగు రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో థియేటర్లలో అఖండ ప్రదర్శితమవుతున్నా కూడా ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. అయితే ఈ సినిమా అరుదైన రికార్డులను కూడా సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం.

మహేష్ బాబు థియేటర్ లో అఖండ సినిమా వీర లెవెల్ లో అరాచకం సృష్టించింది. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అఖండ 42 రోజుల్లో ఏఎమ్‌బి సినిమాస్‌లో కోటీ 14 లక్షల 83,500 రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించి బాలయ్య అంటే ఏంటో నిరూపించింది.. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో కోటి రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించడం అంత తేలిక కాదు. అయితే బాలయ్య మాత్రం అఖండ సినిమాతో సునాయాసంగా ఈ రికార్డును అందుకున్నారనే చెప్పవచ్చు. ఫుల్ రన్ లో అఖండ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది.

 అఖండ విడుదలై ఏడు వారాలవుతున్నా కూడా ఈ సినిమా దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. అమెరికాలో కూడా అఖండ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఫైట్లు కూడా ఎక్కువగా ఉన్నాయని ఫస్ట్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేదని విమర్శలు కూడా వచ్చినా అఖండ అన్ని ప్రాంతాల్లో అదుర్స్ అని అనిపించుకుంది. బాలయ్య సినీ కెరీర్ లో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన సినిమాగా అఖండ నిలిచింది.కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

 బాలయ్య తర్వాత సినిమా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఫిక్స్ అయింది. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నారు.. భారీ బడ్జెట్ తో ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: