టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బంగార్రాజు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించగా మరో ముఖ్యమైన పాత్రలో అక్కినేని నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నారు. బంగార్రాజు సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలైన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. నాగార్జున,  నాగ చైతన్య ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమాపై ముందు నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.  అలాగే ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందే మరో రికార్డ్ ను సాధించింది.

 సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ కాబోతున్న పెద్ద మూవీ బంగార్రాజు' కావడంతో ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ నెలకొంది. దీంతో ఈ సినిమాను భారీ స్థాయిలో మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి నైజాంలో 211, సీడెడ్‌లో 130, ఆంధ్రాలో 335 వరకూ అంటే మొత్తంగా 675 నుంచి 700 థియేటర్ లు కేటాయించారని తెలుస్తోంది. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 100, ఓవర్సీస్‌లో 400 థియేటర్లలో బంగార్రాజు సందడి చేయనున్నారట. మొత్తంగా చెప్పాలంటే బంగార్రాజు సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1200 థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ రేంజ్ లో సినిమా రిలీజ్ కావడం నాగార్జున కెరీర్ లైన్ బెస్ట్ రికార్డ్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: