మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సినిమాకు సన్నద్ధం అవుతున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి కాగానే మహేష్ త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమా తర్వాత మహేష్ జక్కన్నతో భారీ మూవీ ప్లానింగ్ లో ఉండగా త్రివిక్రం మెగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. త్రివిక్రం శ్రీనివాస్ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబందించిన కథ ఒకటి రెడీ చేసుకున్నాడట.

ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటిస్తుందని తెలుస్తుంది. ఆఫ్టర్ డైవర్స్ సమంత తన సినిమాల జోరు కొనసాగిస్తుంది. అసలేమాత్రం తగ్గని జోష్ తో సినిమాలు, వెబ్ సీరీస్ లు, స్పెషల్ సాంగ్ లతో రెచ్చిపోతుంది. త్రివిక్రం సినిమాని కూడా సమంత ఛాలెంజింగ్ గా తీసుకోబోతుందని తెలుస్తుంది. ఆల్రెడీ ఆయన డైరక్షన్ లో అ ఆ, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల్లో నటించిన సమంత ఈసారి స్పెషల్ మూవీ ఫీమేల్ సెంట్రిక్ మూవీ కోసం పనిచేయనున్నారని తెలుస్తుంది. సమంత కూడా ఇక మీదట సినీ కెరియర్ మీదనే ప్రత్యేక దృష్టి సారించాలని చూస్తుంది. అందుకు తగినట్టుగానే కెరియర్ ప్లాన్ చేసుకుంటుంది.

పర్సనల్ లైఫ్ ఎలాగు డిస్ట్రబ్ అయ్యింది కాబట్టి ఇక మీదట సినిమా కెరియర్ విషయంలో దూసుకెళ్లాలని ఫిక్స్ అయ్యింది సమంత. అందుకే డేరింగ్ స్టెప్పులతో అదరగొడుతుంది. సమంతని చూసి మిగతా హీరోయిన్స్ కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. పెళ్లి తర్వాత సమంత దూకుడు చూస్తుంటే అమ్మడు మరో పదేళ్లు ఇదే ఉత్సాహం చూపించేలా ఉందని అంటున్నారు. ప్రస్తుతం శాకుంతలం, యశోద సినిమాలతో పాటుగా రాజ్ అండ్ డీకే చేస్తున్న వెబ్ సీరీస్ లో కూడా సమంత నటిస్తుంది.  పుష్ప లో చేసిన స్పెషల్ సాంగ్ వల్ల ఆమెకు ఇలాంటి స్పెషల్ సాంగ్ ఆఫర్లు కూడా మళ్లీ వచ్చినా రావొచ్చని చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: