దానికి తోడు అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్ లో రీమేక్ కావడం అందులో వేరొక హీరో నటించిన కూడా ఆయనకు మించిన పేరు విజయ్ దేవరకొండ కి రావడం ఇప్పుడు బాలీవుడ్ లో ఆయనకు మంచి ఇమేజ్ ఏర్పడడానికి కారణం. అలా ఆయనకు ఆ సినిమాతో అక్కడ వచ్చిన ఇమేజ్ కారణంగా ఆయన సినిమాలు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చేవి. అయితే విజయ్ దేవరకొండ తన ఇమేజ్ ను ఉపయోగించుకొని సినిమాలను విడుదల చేయలేదు. ఆ విధంగా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా తెలుగునాట దీనికి వచ్చిన రెస్పాన్స్ చూసి బాలీవుడ్ ఎంతో ఆశ్చర్యపోయారట. పిచ్చి అభిమానం తో అభిమానులు చేసిన సందడి చూసి ఒక్కసారిగా అభిమానం అంటే ఈ రేంజ్ లో ఉంటుందా అన్నట్లుగా వారు నోరెళ్ళబెట్టి చూసినట్లు చూస్తారట. దాంతో విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ చూసి ఇతర దర్శకనిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేసే విధంగా ముందుకు వస్తున్నారు. తొందరలోనే విజయ్ దేవరకొండ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదని కొంతమంది బాలీవుడ్ మీడియా వారు చెబుతున్నాయి.