ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించారు.  రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలో మొదటి భాగం పోయిన సంవత్సరం డిసెంబర్ 17 వ తేదీన విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇంత బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ సినిమా విజయంలో సమంత స్పెషల్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది అని చెప్పవచ్చు.  

ఈ సినిమాలో సమంత చేసిన ఉ అంటావా మావ, ఊ ఊ  అంటావా, అనే స్పెషల్ సాంగ్ కఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యింది. ఇలా పార్ట్ వన్ లో ఐటమ్ సాంగ్ ఇంత క్రేజ్  తెచ్చుకోవడంతో పుష్ప పార్ట్ టు లోను ఐటెం సాంగ్ పెట్టాలనే ఉద్దేశంలో సుకుమార్ ఉన్నట్లు ఇప్పటినుండే వార్తలు వస్తున్నాయి. అయితే పార్ట్ వన్ లో సమంత తో ఐటం సాంగ్ చేయించిన సుకుమార్, పుష్ప పార్ట్ టు లో మాత్రం బాలీవుడ్ బ్యూటీ తో చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దానికి ప్రధాన కారణం పుష్ప పార్ట్ వన్ సినిమాకు బాలీవుడ్ లో ఫుల్ క్రేజీ వచ్చింది. సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ కూడా అయింది. అయితే ఆ కారణంగా బాలీవుడ్ లో క్రేజీ ఉన్న బ్యూటీ అయితే ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందనే ఆలోచనలో సుకుమార్ వున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే పుష్ప సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ఫేహాద్ ఫాసిల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు, అలాగే అనసూయ, సునీల్ ముఖ్య పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: