సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు వస్తుంటారు, పోతుంటారు, కానీ కొంతమంది హీరోయిన్ లు మాత్రం తాము నటించిన మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకని ఆ తర్వాత కూడా క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటు తమ హవాను కొనసాగిస్తూ ఉంటారు, అయితే అలా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకని, ఆ తర్వాత క్రేజీ సినిమా ఆఫర్ లను దక్కించుకుంటున్న హీరోయిన్ లలో కృతి శెట్టి ఒకరు. ఈ ముద్దుగుమ్మ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా ఆఫర్లు దక్కాయి.  

అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా థియేటర్ లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది, అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన బంగార్రాజు సినిమా కూడా ఈ రోజు అనగా 14 జనవరి 2022 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాలతో పాటు ఈ ముద్దుగుమ్మ సుధీర్ బాబు సరసన ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది,  అలాగే నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది, వీటితో పాటు రామ్ పోతినేని సరసన కూడా ఈ ముద్దుగుమ్మ ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా కృతి శెట్టి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న డ్రెస్సు ను వేసుకొని డీసెంట్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం శృతి శెట్టి కి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: