ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు అని అంద‌రినీ ఆక‌ట్టుకున్న నాగార్జున..ఇప్ప‌టికీ ఆయ‌నను చూస్తే అమ్మాయిలు ఆ పాటే పాడుకునేలా చేయ‌గ‌ల‌రు.అంత గొప్ప‌గా స్క్రీన్ ప్రెజెన్స్ ఇవాళ్టికీ ఉంది. ముందుగా ఫిట్నెస్ కు రారాజు ఈ బంగార్రాజు. ఈ వ‌య‌సులో హీరోలు ఎలా ఉంటారు ముడ‌త‌ల పోయిన ముఖంతో జ‌బ్బ‌ల‌తో ఏదో అంద వికారంగా ఉంటారు. కానీ ఆయ‌న మాత్రం న‌వ మ‌న్మ‌థుడు.కొడుకుతో పోటీ ప‌డి మ‌రీ! న‌టించ‌గ‌ల స‌త్తా ఉన్న న‌వ మ‌న్మ‌థుడు అని రాయాలి.ఈ సినిమా అందుకు ఒక మంచి ఉదాహ‌ర‌ణ..బంగార్రాజు పాత్ర‌తో ఎన్ని సినిమాలు అయినా చేయొచ్చు..అన్నింటికీ మూలం నాగ్..అన్నింటికీ కార‌ణం కూడా అతనే! అంత‌గా రాణించాడు ఈ పాత్ర‌లో!

నువ్వు పెళ్లి చేసుకెళ్లిపోతే బంగార్రాజు..మాకెవ‌రు కొనిపెడ‌త‌రు కొకా గ్లౌజు అని పాట రాశాడు క‌ల్యాణ్ కృష్ణ (డైరెక్ట‌ర్).. అబ్బ! విన‌గానే అదిరిపోయింది..ఆయ‌న మాటల గారిడీనే కాదు అందంతో కూడా బురిడీ కొట్టిస్తాడ‌ని డైరెక్టర్ ఈ పాట‌లో రాశారు. రాసిన విధంగా ఈ సినిమా అంతా నాగ్ మానియానే క‌నిపిస్తుంది.మ‌రో ప‌ది  సినిమాల‌కు స‌రిప‌డా క‌థ,కొన‌సాగింపున‌కు వీలున్న క‌థ,ఈ సీజ‌న్ను కంటిన్యూ చేసినా పెద్దగా బోరెత్తించని వైనం అన్నీ అన్నీ ఇప్పుడు థియేట‌ర్ల‌లో సంద‌డికి కార‌ణం అవుతున్నాయి.రేప‌టి వేళ కూడా ఇదే మానియా కంటిన్యూ కానుంది కూడా!

తెల్ల‌పంచె లో అదిరిపోతున్నాడు నాగార్జున..మ‌న్మ‌థుడు నాగార్జున అని ఎందుకంటారో ఆడాళ్లంతా మ‌రోసారి అర్థం చేసుకునేలా, మ‌గాళ్లంతా మ‌రోసారి నివ్వెర పోయేలా చేశారు నాగార్జున.ఈ సినిమాతో మ‌రో సారి అక్కినేనిని గుర్తుకు తెచ్చి అంద‌రి మ‌తులూ పోగొట్టారు నాగార్జున. ఎవ‌ర్ గ్రీన్ ఏఎన్నార్ కు ఈయ‌న‌కూ మ‌ధ్య న‌టన ప‌రంగా ఎన్నో తేడాలున్నా ఇలాంటి ప‌ల్లె నేప‌థ్యం ఉన్న క‌థ‌ల‌కు ఆయ‌నే సాటి. హీరో నాగార్జున వ‌య‌సు వ‌స్తున్న కొద్దీ అందంలోనూ అభిన‌యంలోనూ సాధిస్తున్న లేదా సాధించిన ప‌రిణితికి సంకేతం బంగార్రాజు సినిమా.


మరింత సమాచారం తెలుసుకోండి: