జోష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అక్కినేని నాగచైతన్య ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆలరిస్తూ వస్తున్నాడు. మధ్యలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం ఆలరించక పోయినా కూడా తన నటనతో వారిని ఎప్పటికప్పుడు మెప్పిస్తునే వస్తున్నాడు. సినిమా సినిమాకి మంచి పరిణితి కనబరుస్తూ తెలుగు ప్రేక్షకులలో తనపై మంచి అభిప్రాయం వచ్చేలా చేసుకున్నాడు. అయితే ఎక్కువగా క్లాస్ అభిమానులను అలరిస్తూ వచ్చిన నాగాచైతన్య ఇప్పుడు అభిమానులను అలరించే విధంగా బంగార్రాజు సినిమా చేయడం విశేషం.

తండ్రి నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్కినేని నాగార్జున గెస్ట్ పాత్రలో ఈ చిత్రంలో నటిస్తున్నాడు అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇది పూర్తిగా నాగచైతన్య సినిమానే అని చిత్ర యూనిట్ చెబుతోన్న నేపథ్యంలో ఈ సినిమాపై యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ రోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. నాగచైతన్య నటన కు మాస్ ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఏదేమైనా నాగ చైతన్య ఈ పాత్ర లో తండ్రికి తగ్గ నటనను కనబరిచాడని అని చెప్పవచ్చు.

వాస్తవానికి నాగచైతన్య గత కొన్ని సినిమాల నుంచి వరుస ప్రయోగాలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. మొదట్లో ఆయన సినిమాల ఎంపిక కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ రానురానూ ఆయనకు అనుభవం వచ్చిన కొద్ది మంచి మంచి సినిమాలను ఎంచుకుంటూ కొత్త కొత్త పాత్రలు అందుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఆ విధంగా లవ్ స్టోరీ సినిమాతో ఇటీవలే మంచి హిట్ కొట్టి లవర్ బాయ్ గా ప్రేక్షకులను అలరించిన నాగచైతన్య ఇప్పుడు మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా బంగార్రాజు పాత్రలో కనిపించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీని తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాగ చైతన్య. 

మరింత సమాచారం తెలుసుకోండి: