మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని నిర్మాత దిల్ రాజు నిర్ణయించడం ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులను తీవ్రమైన నిరాశ తో పాటు చిత్ర యూనిట్ పై భారీ ఆగ్రహం కలిగేలా కూడా చేస్తుంది అని చెప్పవచ్చు. 

ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల పోస్ట్ పోన్ అయ్యిందనే బాధలో ఉన్న రామ్ చరణ్ అభిమానులకు ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ అన్నట్లు ఈ సినిమా విడుదల వచ్చే ఏడాది సంక్రాంతికి ఉందని ఈ ఏడాది సంక్రాంతికి ప్రకటించడం వారిలో తీవ్రమైన నిరాశ కలగజేస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో తొలిసారి రామ్ చరణ్ పాన్ ఇండియా మార్కెట్లోకి ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా అడుగుపెట్టబోతున్నాడు. జనవరి 7వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని రకాల కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇక విడుదల సమరమే అని అనుకునే సమయానికి ఈ సినిమా పోస్ట్ చేయడం అభిమానులను భారీగా నిరాశపరిచింది.

అయితే పరిస్థితులు అనుకూలించకప్పోతే ఏం చేస్తాం అని వారిలో వారు సర్ధి చెప్పోకోగా రాబోయే చరణ్ సినిమా అయినా తొందరగా చూడొచ్చు అని ఆశించిన వారికి నిజంగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవడం అనే న్యూస్ రావడం తీవ్రమైన నిరాశ కలిగిస్తుంది అని చెప్పవచ్చు. దాంతో ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు పై సోషల్ మీడియా వేదికగా ఎంతో ఆగ్రహిస్తున్నారు ఆయన అభిమానులు. ఈ లోపు ఓ చిన్న దర్శకుడితో సినిమా చేసి దాన్ని విడుదల చేయాలి అనేది రామ్ చరణ్ ఆలోచన. మరి శంకర్ సినిమా లో ఎంత కథ ఉందో తెలియదు కానీ ఇన్ని రోజులు సినిమా విడుదల కాకపోవడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: