టాలీవుడ్ సినిమా పరిశ్రమకు రెండు కళ్ళ లాంటి వారు సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ మరియు తమన్. వీరు నెంబర్ వన్ పొజిషన్ నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ పడుతున్నారు అనే కంటే రెండు కళ్ళ లాంటి వారు అంటేనే బాగుంటుందేమో. వారి టైం వచ్చినప్పుడు తమ తమ సంగీతం తో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటారు. కేవలం మాటలతోనే కాదు నేపథ్య సంగీతంతో కూడా ఈ ఇద్దరూ ఏమాత్రం తగ్గేదే లేదు అన్నట్లుగా సినిమా చేసి అందరికంటే ఎక్కువగా పేరును తమ సొంతం చేసుకుంటారు.

అయితే ఎప్పటినుంచో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వీరిద్దరే అగ్ర సంగీత దర్శకులు గా ఉంటున్నారు. వీరి తరువాత ఏ సంగీత దర్శకుడు కూడా అదే స్థాయిలో సంగీతాన్ని అందించకపోవడం తెలుగు సినిమా అభిమానులకు కొంత నిరాశ పరుస్తుంది చెప్పవచ్చు. అయితే వీరికి పోటీ ఇవ్వగల సంగీత దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది అనూప్ రూబెన్స్ అని చెప్పవచ్చు. పెద్ద సినిమాల అవకాశాలు రావటం లేదు కానీ వస్తే మాత్రం తప్పకుండా ఈ సంగీత దర్శకుడు తన సత్తా చాటుకుంటాడు. ఇప్పటికే కొన్ని సినిమాలకు ఆయన చేసే సంగీతానికి భారీ స్థాయిలో గుర్తింపు వస్తుంది.

ఆలా ఈ సంక్రాంతికి వీరిద్దరి సంగీత దర్శకుల కంటే తనదే పైచేయి అని అనూప్ రూబెన్స్ నిరూపించుకున్నాడు. బహుశా ఇలా జరగడం ఇదే తొలిసారి కావచ్చు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన సినిమానే సూపర్ హిట్ అయ్యింది. సూపర్ మచ్చి సినిమాతో తమన్ ప్రేక్షకుల ముందుకు రౌడీ బాయ్స్ చిత్రంతో దేవి శ్రీ ప్రసాద్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలా నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా వచ్చి ఈ రెండు సినిమాల కంటే భారీ విజయాన్ని సాధించగా ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ విధంగా అనూప్ రూబెన్స్ తొలిసారి ఈ నెంబర్ వన్ ప్లేస్ లోకి వచ్చాడు. భవిష్యత్తులో మంచి సినిమా అవకాశాలు వస్తే మంచి సంగీతం అందిస్తాడు అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: