టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోగా తనకంటూ మంచి ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు మాస్ రాజా రవితేజ. ఆయన సినిమాలు ఎక్కువగా మాస్ ప్రేక్షకులను అలరించాయి కాబట్టి తొందరగా ఆయనకు మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ ఇవ్వగలిగారు. ప్రస్తుతం ఆయనకు మంచి మార్కెట్ ఉంది తెలుగులో. ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమమ్ గ్యారంటీ హీరోగా రవితేజ ఎదిగాడు అంటే దీని వెనక ఆయన కృషి ఎంతో ఉందని అర్థం చేసుకోవచ్చు. అలాంటి రవితేజ ఇప్పటివరకు తన కెరీర్లో ఎప్పుడూ కూడా రీమేక్ సినిమాలను చేయలేదు. 

గతంలో ఓ సినిమా రీమేక్ చేయాలని భావించగా దానికి ప్రయత్నాలు చేయగా ఎందుకో అది వర్కౌట్ కావడం లేదు. అప్పటినుంచి ఆయన రీమేక్ సినిమాలు చేయడం అనే ఆలోచనను పక్కన పెట్టేశాడు. తాజాగా రవితేజ రీమేక్ సినిమా చేయాలని భావిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే తమిళనాట సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం మానాడు. శింబు హీరోగా నటించిన ఈ చిత్రం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కగా అది భారీ రికార్డులను సృష్టించింది. టైం లూప్ నేపద్యంలో టైం ట్రావెలింగ్ సినిమాగా తెరకెక్కింది ఈ చిత్రం.

ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి కథాంశంతో ఉన్న చిత్రం రాలేదని చెప్పాలి. అలాంటి ఈ సినిమాలు తెలుగులో తెరకెక్కించాలని పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేయగా దీనికి హీరోగా రవితేజ అయితే బాగుంటుందని ఆయనను ఎంపిక తీసుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే నాలుగైదు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ సినిమా ఎంతవరకు ఒప్పుకుంటాడు అనేది చూడాలి. ఒకవేళ ఒప్పుకున్నా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాతనే ఆయన సినిమా చేసాడు కాబట్టి అదంటే మరొక రెండు సంవత్సరాలు వేచి చూడాల్సిందే. ఇకపోతే రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమా ను పూర్తి చేసి తొందరలోనే విడుదలకి సిద్ధం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: