బంగార్రాజు.. సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడు వస్తే ఇంటిల్లిపాదీ ఎంత సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తారో.. ఈ బంగార్రాజు సినిమా తో థియేటర్లు కూడా ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి.. నిజంగా సంక్రాంతి పండుగకు బంగార్రాజు సినిమా వచ్చి మరింత సంబరాన్ని తెచ్చింది.. ఇంటిల్లిపాది ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా బంగార్రాజు సినిమాను చూసి ఆనందించ వచ్చు అని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సినిమాకు 5 షో లు వేసుకొనే ఛాన్స్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కలెక్షన్ల పరంగా కూడా మంచి లాభాన్ని తెచ్చిపెట్టే లా కనిపిస్తోంది.. అసలే సంక్రాంతి.. పైగా అక్కినేని ఫ్యామిలీ..అందులోనూ ఎంటర్టైన్మెంట్ సినిమా.. అక్కినేని వారసులు.. ఇక ఈ సినిమా చూడ్డానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు..


ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. సోగ్గాడే చిన్నినాయన సినిమా లో డ్యుయల్ రోల్ చేసి తన పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసిన నాగార్జున ఈ సినిమాలో కూడా అంతే అద్భుతంగా నటించాడు. యమధర్మరాజు దగ్గర చేసే సన్నివేశాలు కానీ, స్వర్గంలో అమ్మాయిలతో విహరించే నైజం కానీ.. యాక్షన్స్, రొమాన్స్, డైలాగ్స్.. అన్నీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అవుతున్నాయి. ఇందులో నాగార్జున నటించిన తీరు..వేసే డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి..


నాగచైతన్య కూడా తన పాత్రలో లీనమైపోయి నటించినప్పటికీ ఈయన ముందు దిగదుడుపే అని చెప్పాలి.. ఇక కృతి శెట్టి నటన కూడా బాగా ఉన్నప్పటికీ నాగచైతన్య , కృతి శెట్టి ల వంటి నటులను నుంచి తన నటనా ప్రతిభను చూపించారు నాగార్జున.. ఇక ఈ సినిమాలో నాగార్జున నటనను చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా బంగార్రాజు లాగే ఉన్నావయ్యా అంటూ తెగ పొగిడేస్తున్నారు.. 60 సంవత్సరాలు పైబడినా కూడా నాగార్జున యంగ్ హీరోలకు మించి నటించడంతో ప్రతి ఒక్కరు కూడా ఆయన నటనకు ఫిదా అవుతున్నారు. అంతే కాదు ఎన్ని సంవత్సరాలు వచ్చినా నువ్వు మాత్రం ఎప్పటికీ నవమన్మధుడే అంటూ కితాబు కూడా ఇవ్వడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: