మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు, క్రాక్ సినిమా ఇచ్చిన జోష్ లో ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలలో నటిస్తున్నాడు, ఇందులో భాగంగా ప్రస్తుతం రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఈ సినిమాను ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది.
రవితేజ ఈ సినిమా తో పాటు రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నడు, ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు,  వీటితో పాటే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమాలో కూడా రవితేజ నటించబోతున్నాడు, ఈ మూడు సినిమాలతో పాటు రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే సినిమాలో కూడా హీరోగా నటించబోతున్నాడు,  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయగా దానికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది,  అయితే తాజాగా ఈ చిత్ర బృందం మరొక పోస్టర్ ను విడుదల చేసింది, ఈ పోస్టర్  ద్వారా రావణాసుర సినిమాను 30 సెప్టెంబర్ 2022 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఈ పోస్టర్ లో రవితేజ లాయర్ డ్రెస్ వేసుకొని, సిగరెట్ తాగుతూ, చేతిలో లైటర్ పట్టుకొని ఉన్నాడు. ఇలా రావణాసుర చిత్ర బృందం ఈ పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసింది, ఈ సినిమాకు అభిషేక్ నామా నిర్మాత. రవితేజ ఈ సినిమాతో  పాటు టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: