సినిమా అంటే అని రంగులు కలిసి ఉండాలి అప్పుడే ఆ సినిమా పూర్తి స్దాయిలో హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది. ఇక నేడు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన బంగార్రాజు సినిమా లో కూడా అన్నీ ఎమోషన్స్ ని బాగా కవర్ చేసాడు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. సంక్రాంతి కానుకగా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన బంగార్రాజు సినిమా ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కరోనా ఆంక్షలు విధించినప్పటికి ఏ మాత్రం భయపడకుండా నాగార్జున సినిమాని ధియేటర్ లల్లో బంగార్రాజు మూవీని రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాడు.

ఇక నాగార్జున కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ఈ బంగార్రాజు సినిమా సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో నాగార్జున కు జోడీగా నటించిన సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఈ సినిమాలో కూడా ఆయనకు భార్యగా కనిపించి తనదైన నటనతో అభిమానులను మెప్పించ్చింది. ఇక బంగార్రాజు మనవడిగా చైతన్య మనకు కనిపించగా..బంగార్రాజు కొడుకు రాం మాత్రం అమెరికాలో ఉన్నట్లే ఈ సినిమాలో మనకు చూయిస్తారు.

ఇక బంగార్రాజు మనవడు జీవితంలోకి ఊహించని విధంగా నాగలక్ష్మి ఎంటర్ అయ్యి ఆయనను ఎలా జరగబోయే ప్రమాదాల నుండి కాపాడుతుందనేది మెయిన్ ట్వీస్ట్. ఈ సినిమాలో అందరు వాళ్ల పాత్రలకు పూర్తి న్యాయం చేసి నటించడం వల్ల సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. కానీ మ్యూజిక్ పరంగా మాత్రం అనూప్ రుబెన్స్  అనుకున్నంత స్దాయిలో ఆకట్టుకోలేకపోయాడు అంటున్నారు అభిమానులు. అనూప్ మ్యూజిక్ లో ఉండే మ్యాజిక్ ఈ సినిమా లో మిస్ అయ్యిన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అతి తప్పిస్తే మిగతా అమతా కూడా సినిమాలో బాగుంది అంటున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: