ఎవ్వరు ఊహించని విధంగా కరోనా మహమ్మారి విజృంభించడం..దీంతో పలు రాష్ట్రాలు కరోనా కట్టడి లో భాగంగా కొన్ని ఆంక్షలు తీసుకురావడం.. కొత్త రూల్స్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన బడా బడా సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం..ఇక పెద్ద సినిమాలు సంక్రాంతి రేస్ నుండి తప్పుకోవడంతో చిన్న సినిమాలకు లైన్ క్లియర్ అయ్యి..సంక్రాంతి బరిలోకి దిగడం చకచకా జరిగిపోయాయి.

ఇక సంక్రాంతి పండుగ కానుక రిలీజైన చిత్రం బంగార్రాజు..సినిమా పేరునే ఇంత మాస్ గా పెట్టాడంటే డైరెక్టర్ సినిమాని ఇంకెంత మాస్ గా తెరకెక్కించుంటాడో అని అనుకున్న అభిమానులకు అంతకు మించి మాస్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చాడు బంగార్రాజు సినిమాని తెరకెక్కించిన దర్శకుడు  కల్యాణ్. సోగ్గాడే చిన్నినాయనా లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీని తీసి సూపర్ హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ..ఇక అదే మూవీకి సీక్వెల్ గా ఈ బంగార్రాజు సినిమాని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ తో హిట్ లిస్ట్ లో నిలిచింది.

ఈ మూవీలో అక్కినేని నాగార్జునకు జోడీగా అందాల తార సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించగా..యంగ్ హీరో గా నటించిన నాగచైతన్య పక్కన లెటేస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి ఫస్ట్ టైం మాస్ పాత్రలో చేసి అలరించింది. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరో మ్యాటర్ ఏమిటంటే..సంక్రాంతికి విడుదల అవుతున్న పెద్ద సినిమా బంగార్రాజు మూవీ ఒక్కటే..మిగత రెండు సినిమాలు యంగ్ హీరోలు కావటం  పైగా సినీ ఇండస్ట్రీకి ఎంటర్ అవుతున్న సినిమాలు కావడంతో వాళ్ల సినిమాలు ఎంత హిట్ టాక్ తెచ్చుకున్న బంగార్రాజు సినిమా ముందు తక్కువే అవుతాయి. ఇక ఈ విధంగా బంగార్రాజు సినిమాకి అన్నీ విధాలా అదృష్టం కలిసొచ్చిందనే  అంటున్నారు సినీ ప్రముఖులు. మొత్తానికి సంక్రాంతికి బంగార్రాజు పండగలాంటి సినిమానే అని చెబుతున్నారు సినిమా చూసిన జనాలు. మరి కలెక్షన్స్ పరంగా ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..?

మరింత సమాచారం తెలుసుకోండి: