ఎవ్వరు ఊహించని విధంగా సంక్రాంతి రేస్ లోకి రావడమే కాకుండా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది నాగార్జున, నాగ చైతన్య నటించిన బంగార్రాజు సినిమా. మొదటి నుండి ఈ సినిమా ఓ పండగ లాంటి వాతవరణాని క్రియేట్ చేస్తుంది..అందరు ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా అని నాగార్జున చెప్పుతూనే ఉన్నారు. ఇక ఫైనల్ గా నేడు ధియేటర్స్ లోకి లోకి రిలీజ్ అయ్యాక ..సినిమా చూసిన జనాలు కూడా అదే అంటున్నారు. ఈ సంక్రాంతికి అందరు ఫ్యామిలీతో కలిసి  చూడాల్సిన సినిమా అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

ఇక సినిమా కధ విషయానికి వస్తే..సోగ్గాడే చిన్నినాయనా ఎక్కడ ఫుల్ స్టాప్ పడ్డిందో అక్కడ నుండే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. బంగార్రాజు వారసుడిగా నాగ చైతన్య తాత పోలికలతో మొత్తంగా దిగిపోతాడు..అంతేనా అమ్మాయిలతో చిల్ అవుతూ సరదాగా ఏడిపిస్తూ..ఆటపట్టిస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. సడెన్ గా ఆయన లైఫ్ లో ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. ఇక వాటిని నాగచైతన్య ఎలా ఎదురుకున్నాడు..? తాత బంగార్రాజు మనవడికి ఎలా సపోర్ట్ చేసాడు..? ఆయన లైఫ్ లోకి వచ్చిన నాగలక్ష్మి కధను ను ఎలా మలుపు తిప్పుతుంది అనేది అసలు సినిమా.

ఇంత వరకు మనం నాగచైతన్య ని క్లాస్ లుక్ లోనే చూశాం..కానీ ఫర్ ది ఫస్ట్ టైం చైతన్య మాస్ లుక్ లో కనిపించి అందరికి షాకిచ్చాడు. మాస్ లుక్ లోను అక్కినేని కుర్రాడు ఇరగదీసాడు. ముఖ్యంగా చైతన్య లో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందని ఈ సినిమాలో కళ్యాణ్ మనకు బాగా చూయించాడు. ఇక లవ్ స్టోరీ లాంటి సుపర్ హిట్ సినిమా తరువాత వచ్చిన బంగార్రాజు సినిమా కూడా చైతన్యకి మంచి పేరు తీసుకొచ్చిందనే చెప్పాలి. బంగార్రాజు సినిమాటాక్ పరంగా బాగానే ఉన్నా కలెక్షన్స్ పరంగా ఏమేరకు రాబడుతుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: