తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీగా అంచనాలు అనేవి నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు విడుదలైనా కానీ తెలుగు రాష్ట్రాల్లో 300 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించడం గ్యారంటీ అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి2 సినిమా ఓవర్సీస్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేయగా ఆర్ఆర్ఆర్ సినిమా ఆ రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ బాగా నమ్ముతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీపై బాలీవుడ్ లో మాత్రం క్రేజ్ అంతకంతకూ తగ్గుతోందనే కామెంట్లు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి.బాహుబలి సిరీస్ వల్ల ప్రభాస్ కు బాలీవుడ్ లో ఊహించని రేంజ్ లో పాపులారిటీ వచ్చినా కానీ రాజమౌళికి మాత్రం అదే స్థాయిలో పాపులారిటీ అయితే దక్కలేదు. ఆర్ఆర్ఆర్ మూవీపై బాలీవుడ్ లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసి జక్కన్న అంచనాలు పెంచగా విడుదల డేట్ వాయిదా పడటంతో ప్రమోషన్స్ కూడా వృథా అయ్యాయి.

 ఆర్ఆర్ఆర్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత బాలీవుడ్ లో ఈ సినిమాకు మళ్లీ ప్రమోషన్స్ ను ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది.ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజయ్యే వరకు కూడా ఖచ్చితంగా బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన అప్ డేట్లు ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచాలని తారక్ ఇంకా చరణ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా బాలీవుడ్ లో భారీస్థాయిలో కలెక్షన్లు నమోదు చెయ్యలేకపోతే చరణ్, తారక్ మూడున్నరేళ్ల కష్టం వృథా అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కగా సమ్మర్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో పెద్ద సినిమాల విడుదల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: