అక్కినేని మల్టీస్టారర్ గా వచ్చిన బంగార్రాజు అనుకున్నట్టుగానే సూపర్ హిట్ కొట్టేసింది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వల్ గా వచ్చిన ఈ బంగార్రాజు సినిమాలో నాగార్జున, నాగ చైతన్య ఇద్దరు అదరగొట్టేశారు. నాగార్జున ఎవర్ గ్రీన్ ఎనర్జీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో చిన బంగర్రాజు పాత్రలో నాగ చైతన్య తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో అక్కినేని ఫ్యాన్స్ ని మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.

బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య చాలా ప్రత్యేకంగా అనిపిస్తాడు. అంతేకాదు ఈ సినిమా హిట్ తో కెరియర్ లో వరుసగా నాలుగవ హిట్ కొట్టేశాడు నాగ చైతన్య. మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న నాగ చైతన్య బంగార్రాజు సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో చైతు డబుల్ హ్యాట్రిక్ కి రంగం సిద్ధం చేసుకున్నాడు. నటుడిగా చైతు తన పరిణితిని సినిమా సినిమాకు పెంచుకుంటూ వస్తున్నాడు.

నాగ చైతన్య ప్రస్తుతం తన హిట్ ఫాం ని కొనసాగిస్తున్నాడు. ఫాం లో ఉన్న బ్యాట్స్ మెన్ సిక్సులు మీద సిక్సులు కొట్టినట్టు నాగ చైతన్య కూడా తన సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకుంటున్నాడు. బంగార్రాజు తర్వాత నాగ చైతన్య విక్రం కె కుమార్ చేస్తున్న థ్యాంక్యు మూవీలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా హిట్టు పడితే నాగ చైతన్య కెరియర్ స్ట్రాంగ్ గా మారినట్టే అని చెప్పొచ్చు. ఆడియెన్స్ తనని ఎలా చూసేందుకు ఇష్టపడుతున్నారో అలాంటి కథలనే ఎంచుకుంటూ వరుస సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తున్నాడు నాగ చైతన్య. అక్కినేని హీరోల్లో నాగ చైతన్య ప్రస్తుతం ఓ రేంజ్ సక్సెస్ మేనియా కొనసాగిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: