రవితేజ హీరోగా వరుస సినిమాలను ఇటీవల కాలంలో ఎనౌన్స్మెంట్ లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా సెట్స్ మీద మూడు సినిమాలను నుంచి ఇప్పుడు మరొక సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లే విధంగా రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇటీవల ఆయన హీరోగా నటించబోయే రావణాసుర సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి ఆ చిత్రాన్ని ఘనంగా లాంచ్ చేశారు. ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండేలా చేశాడు. 

రమేష్ వర్మ దర్శకత్వంలో ఆయన హీరోగా చేస్తున్న ఖిలాడి సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయని చెప్పొచ్చు. వీరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి అని చెప్పవచ్చు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఆయన సంగీతం అందించిన పాటలకు విశేషమైన స్పందన దక్కుతుంది.

ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రాన్ని కూడా మొదలుపెట్టి చివరిదశ చిత్రీకరణకు తీసుకు వచ్చాడు రవితేజ. శరత్ మండవ అనే దర్శకుడు ఈ చిత్రానికి దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే రవితేజ హీరోగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. అయితే ఈ రెండుపి చిత్రాల కంటే ముందుగానే ఆయన ఇటీవల ప్రారంభించిన రావణాసుర చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 30వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల కాకముందే ఇప్పుడు విడుదల చేస్తున్నాడు. మరి దీని వెనక రవితేజ వ్యూహం ఏమై ఉంటుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: