టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఉన్న టాలెంట్ ను ఇతర భాషల వారు గుర్తించి వారితో సినిమాలు చేసే విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు అక్కడి హీరోలు. ఇది అక్షరాల నిజమని మన దర్శకులు ఇతర భాషలలో చేసే సినిమాలను బట్టి తెలుస్తుంది. ఇప్పటికే తెలుగులో మంచి క్రేజ్ ఉన్న ముగ్గురు నలుగురు దర్శకులు తమిళ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. అవి తెలుగులో కూడా విడుదల అవుతుండటంతో పెద్దగా తేడా ఏమి ఉండడం లేదు మన హీరోలకు. అయితే తెలియకుండానే కొంత మంది దర్శకులు ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నారు.

ఇతర భాషలలో వారికి డిమాండ్ బాగా ఏర్పడడానికి ముఖ్య కారణం టాలీవుడ్ లో చేసిన సినిమాలే అయినా టాలీవుడ్ హీరోలు ఎవరు కూడా వారిని పట్టించుకోకపోవడంతో వారు ఇతర భాషలకు వెళ్లడం జరుగుతుంది. అలాంటి వారిలో ఒకరు సంకల్ప్ రెడ్డి. టాలీవుడ్ లో ఇప్పటి వరకు రానటువంటి జోనర్ లలో ఆయన సినిమాలు చేశాడు అని చెప్పవచ్చు. మొదటి సినిమా వాటర్ లో రెండో సినిమాను గాలిలో చేసి వెరైటీ దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు సంకల్ప రెడ్డి.

రాణా హీరోగా నటించిన ఘాజి చిత్రంతో దర్శకుడిగా పరిచయమై వినూత్నమైన సినిమాల తెరకెక్కించే దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఆ తరువాత వరుణ్ తేజ్ హీరోగా నటించిన అంతరిక్షం సినిమాతో అగ్ర దర్శకుడి గా ఎదిగాడు. అయితే ఆయన తన తదుపరి సినిమాను తెలుగులో కాకుండా ఇప్పుడు బాలీవుడ్ లో చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. అక్కడ విద్యుత్ జమల్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో బయటకు రాగా ఈ దర్శకుడు సంకల్ప్ రెడ్డి అని తెలియగానే తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఎందుకు ఈ టాలెంటెడ్ దర్శకుడు కి తెలుగు హీరోలు ఛాన్స్ ఇవ్వడం లేదని కూడా ఆశ్చర్యపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: