మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన క్రాక్ సినిమాతో పోయిన సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు, ఇలా క్రాక్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం అదే ఫామ్ ను కంటిన్యూ చెయ్యాలనే ఉద్దేశంతో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు, అందులో భాగంగా ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెంచాయి, ఈ సినిమాను ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది.

 అయితే తాజాగా ఖిలాడి చిత్ర బృందం మరొక పోస్టర్ ను విడుదల చేసింది, ఈ పోస్టర్ లో రవితేజ ఒక రాడ్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. అలాగే రవితేజ ఈ సినిమాతో పాటు రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ సినిమాకు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు, ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది, అయితే తాజాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు సంబంధించి  పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది, ఈ పోస్టర్ ద్వారా ఈ సినిమాను 25 మార్చి 2022 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది, ఇలా రవితేజ ఒకేరోజు రెండు సినిమా అప్డేట్ లను తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: