అలనాటి స్టార్ హీరోగా పేరు పొందిన సాయికుమార్ కుమారుడు ఆది ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తాజాగా ఈయన నటించిన ఏ సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి ప్రేక్షకులను.. అయినా కూడా ఈ హీరో కి వరుస అవకాశాలు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా ఆది హీరోగా హీరోయిన్ గా నువేక్ష జంటగా నటించిన చిత్రం అతిథిదేవోభవ.. ఈ సినిమాకి డైరెక్టర్ గా పొలిమేర నాగేశ్వర్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమాని ఎంతో బ్రహ్మాండంగా ఈనెల 7వ తేదీన థియేటర్ల లలో విడుదల చేశారు. ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ చవిచూసింది. మొదటి నుంచి ఈ సినిమా బ్యాడ్ టాక్ తో ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాని చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక ఈ సినిమా కనీసం వారం రోజులు కూడా థియేటర్లలో నిలవలేకపోయింది. అయితే ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-10 లక్షలు.
2). సీడెడ్-6 లక్షలు.
3). ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కలెక్షన్స్..7 లక్షలు.
4). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే..23 లక్షలు.
5). వెస్ట్ ఆఫ్ ఇండియా-1 లక్ష.
6). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..24 లక్షలు.

అతిధి దేవోభవ చిత్రం.. థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..1.31 కోట్ల రూపాయలు జరగగా.. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ సాధించాలంటే..1.5 కోట్ల రూపాయలను  రాబట్టాలి.. అయితే చాలా వరకు ఈ సినిమా నిర్మాతలే స్వయంగా విడుదల చేయడం జరిగింది. కానీ వారు అనుకున్న టార్గెట్ ని రీచ్ కాలేదని చెప్పవచ్చు. ఈచిత్రం ముగిసే సమయానికి కేవలం 24 లక్షల రూపాయల నేనా బట్టి.. బయ్యర్లకు 1.7 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఆది కెరియర్ లోనే ఇది అతి పెద్ద డిజాస్టర్ మూవీ గా మిగిలిపోయింది. అయితే ఈసారైనా ఈ హీరో ఆచితూచి అడుగులు వేస్తారెమో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: