ఇటీవల కాలంలో సినిమాల్లో లిప్‌లాక్ సీన్లు చాలా కామన్ గా మారిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లో లిప్ లాక్ సీన్లు లేవు అంటే అటు ప్రేక్షకుల హర్ట్ అయి పోతున్నారు. అంతలా లిప్‌లాక్ సీన్లు ప్రస్తుతం ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలి కాలంలో లిప్ లాక్ సీన్లు పెరిగిపోవడం కారణంగా అవసరం లేకపోయినప్పటికీ ఎంతోమంది తమ తమ సినిమాలలో లిప్ లాక్ సీన్ లు పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు నేటి రోజుల్లో. అందరు హీరోయిన్లు సన్నివేశాల్లో నటించేందుకు ఒప్పుకుంటూ ఉండటం గమనార్హం. అయితే సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య లిప్‌లాక్ సీన్లు ఒకప్పుడు కనిపించేవి కానీ ఇటీవల మాత్రం ఇద్దరు మహిళల మధ్య లిప్‌లాక్ సీన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


 సినిమాలలో మాత్రమే కాదు ఓటిటిలో ప్రసారమయ్యే వెబ్ సిరీస్ లో కూడా ఇలాంటి లిప్ లాక్ సీన్లు కనిపిస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక ఇలా ముద్దు ముచ్చట కు సంబంధించిన అనుభవాలను ఇటీవలే బాలీవుడ్ యువ హీరోయిన్ కీర్తి కుల్హారి ఒక షోలో చెప్పుకొచ్చింది. ఇటీవలే ఒక వెబ్ సిరీస్ లో భాగంగా ఈ అమ్మడు మరో మహిళకు లిప్‌లాక్ ఇస్తుంది.. ఇక ఈ లిప్ లాక్ తో  ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.కానీ ఈ అమ్మడు చెప్పింది విని మరింత ఆశ్చర్యానికి గురి అవుతున్నారు ప్రేక్షకులు. హ్యూమన్ అనే వెబ్ సిరీస్ లో నటించింది కీర్తి కుల్హారి. ఈ క్రమంలోనే సీనియర్ నటి షాఫాలి షా తో లిప్ లాక్ చేసింది.


 ఈ లిప్ లాక్ కు సంబంధించి తన అనుభవాలను సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది కీర్తి. షేఫాలి  తో లిప్ లాక్ సన్నివేశానికి ముందు ఒకే ఒక ఆలోచన నా మనసులో మెదిలింది. ఒకవేళ నాకు మూడోచ్చేస్తే ఎలా అని అనుకున్నాను.. కానీ మళ్లీ నేను కొంచెం వెనక్కి ఆలోచించి ఏంటి నేను మరో స్త్రీని ఇష్టపడుతున్నానా అంటూ ఆలోచించాను అంటూ తనకు ఎదురైన అనుభవాలను ఇటీవల మీడియాతో పంచుకుంది కీర్తి కుల్హారి. షేఫాలి షా తో లిప్ లాక్ సీన్ పూర్తయిన తర్వాత హమ్మయ్య అని ఊపిరి పీల్చు కున్నాను అంటూ చెప్పుకొచ్చింది. దేవుడి దయవల్ల నాకు ఎలాంటి ఫీలింగ్ రాలేదు అంటూ ఎంతో సంతోషపడ్డా అని ఈ యంగ్ హీరోయిన్ చెప్పుకొచ్చింది. ఇక ఈ యంగ్ హీరోయిన్ చేసిన కామెంట్స్ మాత్రం అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: