ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సీనియర్ హీరోలు గా ఉన్నారు ఓ నలుగురు కథానాయకులు.  యుక్త వయసులోనే పరిశ్రమకు వచ్చి మంచి మంచి సినిమాలు చేసి ఇప్పుడు సీనియర్ హీరోలలోనే స్టార్ హీరోలుగా ఈ నలుగురు తమదైన సంచలనం సృష్టిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు వారు ఏ ఏ సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నారు ఒకసారి తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి ఏకంగా నాలుగు సినిమాలను సెట్స్ మీదకు తీసుకువెళ్లి సీనియర్ హీరోలలో ఎవరికీ సాధ్యం కాని విధంగా సినిమాలు చేస్తూ ఉన్నారు.

ఆచార్య సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంచిన చిరంజీవి ఆ సినిమాను విడుదల చేయకముందే మరో నాలుగు సినిమాలు సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. గాడ్ ఫాదర్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దాంతో పాటు భోళా శంకర్ అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలోని సినిమాలను కూడా ఆయన షూటింగ్ దశ లోకి తీసుకు వెళ్ళనున్నాడు. ఇక అక్కినేని నాగార్జున హీరోగా నటించిన బంగార్రాజు చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ఈ విజయోత్సాహం లోనే ఆయన తదుపరి చిత్రం ది ఘోస్ట్ సినీమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.

ఇక విక్టరీ వెంకటేష్ వరుసగా రెండు సూపర్ హిట్ లను సాధించి ఇప్పుడు ఎఫ్ 2 సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతున్న ఎఫ్3 చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు.  ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల చేస్తుందని అందరూ భావించగా ప్రస్తుత పరిస్థితులని బట్టి ఈ చిత్రం ఎప్పుడు విడుదల కావడం లేదని తెలుస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ లో సంక్రాంతి తర్వాత పాల్గొననున్నాడు. భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా బాలకృష్ణ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: