పెద్ద హీరోలకు సాధ్యం కానివి చిన్న హీరోలకు సాధ్యం అవుతూ ఉంటాయి. అందుకే సినిమా పరిశ్రమకు కొత్త నీరు రావడం అనేది చాలా అవసరం అని మన సినీ పెద్దలు చెబుతూ ఉంటారు. కొత్త నీరు వస్తే కొత్త కాన్సెప్ట్ లు వస్తాయి.. ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి.. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఇప్పటి వరకు ఎంతోమంది కొత్త నటీనటులతో ప్రేక్షకుల ముందుకు వచ్చి స్టార్ లు గా ఎదిగిన వారు ఉన్నారు. అయితే ఎంతమంది వచ్చినా కూడా సినిమా పరిశ్రమ అందరికీ ఆహ్వానం పలుకుతూనే వుంటుంది.

కాబట్టి కొత్తనీరు తో కొత్త రకమైన సినిమాలు రావడం ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఆ విధంగా ఇటీవల కాలంలో కొన్ని వెరైటీ కాన్సెప్ట్ ఉన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. భవిష్యత్తులో కూడా రాబోతున్నాయి. ట్రైలర్ సాంగ్స్ లతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునీ సదరు సినిమాలు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పెద్ద హీరోల కు సాధ్యం కానిది చిన్న హీరో ని ఎందుకు ఈ విధమైన సినిమాలు చేయడం సాధ్యం అవుతుంది అంటే దానికి ఓ లాజిక్ ఉంది.

పెద్ద హీరో సినిమా అనగానే భారీ అంచనాలు ఉంటాయి. మామూలుగానే పెద్ద హీరోలకు భారీ స్థాయిలో అభిమానులు ఉంటారు కాబట్టి ఆ అభిమానుల కోరిక మేరకు తగ్గట్లుగా వారి అంచనాలకు తగ్గట్లుగా సినిమాలో నటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కమర్షియల్ సినిమాలను మాత్రమే పెద్ద హీరోలు చేయవలసి ఉంటుంది. వారు ఇలాంటి ప్రయోగాత్మక సినిమాల జోలికి వెళ్ళలేరు.  అందుకే ప్రయోగాత్మక వెరైటీ కథలు ఉన్న సినిమాలు చేయాలంటే అది కేవలం కొత్తవారికి సాధ్యపడుతుంది. పెద్ద హీరోలకు ఉన్న ఇమేజ్ కారణంగా చేయలేరు కాబట్టి చిన్నస్థాయి హీరోలే ఈ సినిమాలు చేసి స్టార్లుగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగ పడేలా చేసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: