అందాల ముద్దుగుమ్మ తమన్నా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది, ఆ తర్వాత టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, ఇలా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే తమన్నా ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీ తెచ్చుకుంది, అయితే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో  కుర్ర హీరోలతో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం కుర్ర హీరోల ప్రక్కన హీరోయిన్ గా నటించే అవకాశాలు పెద్దగా దక్కడం లేదు, అయితే కుర్ర హీరోల పక్కన అవకాశాలు లేవు అని నిరాశ చెందకుండా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయిన చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోల సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

 అయితే ఇలా సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ల ద్వారా కూడా తమన్నా తన హవాను చాటుతోంది,  అయితే ఇలా సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఆ మధ్యకాలంలో మాస్టర్ చెఫ్ అనే బుల్లితెర టీవీ షోకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది,  తమన్నా సినిమాలలో కేవలం హీరోయిన్ ల పాత్రల కోసం మాత్రమే ఎదురు చూడకుండా స్పెషల్ సాంగ్స్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది, ఇప్పటికే అల్లుడు శీను, జై లవకుశ, కేజిఎఫ్ లాంటి సినిమాలలో స్పెషల్ సాంగ్స్ తో అదరగొట్టిన తమన్నా ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న గని సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది, గని సినిమాలోని తమన్నా స్పెషల్  లిరికల్ వీడియో సాంగ్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేయగా దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది, ఇలా తమన్నా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ అవకాశాలలో మిగతా సీనియర్ హీరోయిన్ లతో పోల్చుకుంటే చాలా వరకు ముందుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: