అక్కినేని సమంత పుష్ప సినిమాలో ఐటం సాంగ్ చేసిన తర్వాత ఒక్కసారిగా తన రేంజ్ ను పెంచుకుంది అని చెప్పవచ్చు. పూర్వవైభవం తెచ్చుకునే క్రమంలో ఆమె ఇప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఐటెం సాంగ్ చేయడానికి ఆమెకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా కూడా అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరో పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమా లో ఆఫర్ వచ్చింది కాబట్టి ఆమె ఆ చిత్రంలోనీ ఈ పాటలో నటించడానికి ఒప్పుకుంది.

అయితే అదే ఆమెకు ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. సినీమాకు దేశ స్థాయిలో మంచి గుర్తింపు రాగా నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది. వారిలో ఒకరైన సమంత కు కూడా మంచి ఇమేజ్ దక్కింది. అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తర్వాత మనస్పర్థల కారణంగా అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సినిమా పరిశ్రమను నమ్ముకుని సినిమాల్లో నటించడానికి ప్రయత్నాలు చేయగా మొదట్లో ఆమెకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. చివరకు ఆమె కొన్ని సినిమాల్లో అవకాశం కలిగింది కానీ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు మాత్రం రావటం లేదు.

దాంతో ఏదైనా గట్టి ప్రయత్నం చేస్తే కానీ ప్రేక్షకులు తన వైపు చూడరు. మేకర్స్ తనను తమ సినిమాలలో పెట్టుకోరు అని అనుకుందేమో. పుష్ప సినిమా ఆమెకు వరం లా ఎదురయిండేమో. ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టడం.. ఆమెను సంప్రదించడం.. ఓకే అనడం.. అన్ని ఒక సారి గా సెట్ అయిపోయాయి. ఆ విధంగా ఇప్పుడు పెద్ద సినిమాల హీరోలు దర్శక నిర్మాతలు కూడా హీరోయిన్ గా పెట్టుకునేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఎన్టీఆర్ మహేష్ బాబు నటించే పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకునేందుకు వీలుగా చూస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలలో ఒక సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా సమంత మునుపటి లా సినిమా అవకాశాలు అందుకోవడం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: