కొన్ని కొన్ని సార్లు కొంత మంది హీరోయిన్లకు మంచి టాలెంట్ మంచి ప్రవర్తన ఉన్న కూడా బొత్తిగా సినిమా అవకాశాలు రావు. కారణం ఏదైనా కూడా వారు సినిమా అవకాశాలను అందుకోక పోవడం వారి అభిమానులను తీవ్రమైన నిరాశ లోకి తీసుకు వెళుతుంది. ఆ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించి కోట్లాది మంది అభిమానులను ఏర్పరుచుకుంది హీరోయిన్ రాశి కన్నా. కానీ ఈమెకు మొదటి నుంచి సినిమా అవకాశాలు మాత్రం ఇతర హీరోయిన్లతో పోలిస్తే చాలా తక్కువగానే వచ్చేవి.

పెద్ద హీరోల సినిమాల సంగతి పక్కన పెడితే చిన్న హీరోల సినిమాలు సైతం పెద్దగా రావడం లేదు ఈ హీరోయిన్ కు. పోనీ ఈమె గ్లామర్ విషయంలో అభినయం ప్రదర్శించే విషయంలో తక్కువ టాలెంట్ చూపిస్తుందా అంటే అది కాదు తన శక్తి మేరకు అందాల ప్రదర్శన చేయడం లో నటించడం లో ఈమె హద్దులు కూడా దాటిపోయింది. అంతే కాదు నటించడంలో కూడా ఇతర హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు అని ఎన్నోసార్లు తన పాత్రలతో నిరూపించుకుంది ఈ హీరోయిన్.

తెలుగు సినిమాలలో కథానాయిక అనగానే పాటలకు, రొమాన్స్ లకు, ముద్దులకు మాత్రమే అనే భవమున్న ఈ రోజులలో తన పాత్రలతో ప్రేక్షకులను అలరించి హీరోలకు దీటుగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఎక్కడో ఒక చిన్న లోపం ఆమెకు పెద్ద సినిమాల అవకాశాలు రాకుండా చేస్తుంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లు పెద్దగా లేకపోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ టాప్ 10 హీరోయిన్లలో ఒకరు. ఇప్పటికీ ఈమె చేతిలో ప్పుడు ఒకటో రెండో ప్రాజెక్టును ఉండడం నిజంగా నిరాశాజనకమైన వార్త అని చెప్పాలి. అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న థాంక్యూ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.  ఆ తర్వాత తెలుగులో కూడా ఈమె ఇంతవరకు ఏ సినిమా కూడా సైన్ చేయకపోవడం ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. మరి ఇప్పటికైనా ఆమె టాలెంట్ ఉపయోగించుకునే విధంగా మన దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశలు ఇస్తారా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: