బాలీవుడ్ సినిమా పరిశ్రమలో సినిమాలు చేయాలి అనేది అందరి హీరోయిన్ ల కల. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద సినిమా పరిశ్రమ అక్కడ సినిమాలు చేస్తే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుందని ఆశ కలగలిపి బాలీవుడ్ సినిమా పరిశ్రమలో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరోయిన్ కూడా కలలు కంటూ ఉంటుంది. ఆ విధంగా అన్ని సినిమా పరిశ్రమలోని హీరోయిన్ లు సైతం బాలీవుడ్లో అవకాశం కోసం ఓ కన్నేసి ఉంచుతారు. ఆ విధంగా తన కెరియర్ మొదట్లోనే బాలీవుడ్లో సినిమా అవకాశాలు అందుకుని అక్కడి ప్రేక్షకులను అలరించడానికి సిద్దం గా ఉంది టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన.

కన్నడ సినిమా పరిశ్రమ నుంచి హీరోయిన్ గా తెలుగులోకి చలో సినిమా ద్వారా వచ్చిన రష్మిక ఆ తర్వాత ఇక్కడ వరుస సినిమాలతో మంచి విజయాలు సాధించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. పెద్ద హీరోల సరసన అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకొనుంది. అక్కడ ఇప్పుడు కొన్ని మంచి మంచి ప్రాజెక్ట్ క నటిస్తుంది రష్మిక. అయితే రష్మిక టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ  పెద్ద హీరోల సరసన అవకాశాలు వస్తున్నా బాలీవుడ్ కి వెళ్లడం పట్ల కొంత మందికి ఏఈపై కొన్ని విమర్శలు చేస్తున్నారు.  

ఆమె ఎందుకు అలా చేస్తుంది అని ఆరా చేయగా ప్రస్తుతం అన్ని భాషలలో పాన్ ఇండియా సినిమాలే తెరకెక్కుతున్నాయి కాబట్టి ఆయా సినిమాలో అవకాశాలు దక్కించుకోవాలనే పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకోవాలి. కాబట్టి బాలీవుడ్ లో సినిమాలలో అవకాశాలు కోసం వెళ్తుందట. అక్కడ సినిమా చేస్తే దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించడం ఖాయం కాబట్టి ఒక్క భాషలో సినిమా చేసి లోకల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడం కంటే అన్ని భాషలలోనూ కొనసాగాలి కాబట్టి పాన్ ఇండియా ఇమేజ్ కోసం బాలీవుడ్ లో సినిమా చేస్తుండగా రష్మిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: