వాస్తవానికి దేశంలోని అన్ని సినిమా పరిశ్రమలలో కెల్లా మంచి కథలు ప్రయోగాత్మక కథలు వెరైటీ సినిమాలు వచ్చేవి ఒక తెలుగు సినిమా పరిశ్రమ నుంచే అని ఇతర భాషల సినీ విశ్లేషకులు చెబుతున్న మాట. తెలుగు సినిమాలోని ఎన్నో కథలు ఇప్పుడు ఇతర భాషలలో రీమేక్ అవుతున్నాయి. ఇది చాలు తెలుగు భాషలలో మంచి సినిమాలు వస్తాయి అని చెప్పడానికి. వాస్తవానికి తెలుగులో సూపర్ హిట్ అయిన ప్రతి సినిమా కూడా ఇతర భాషలలోని మేకర్స్ రీమేక్ చేయడానికి సిద్ధం అవుతుంటాయి. ఇపుడంటే పాన్ ఇండియా సినిమాలు విడుదల అవుతున్నాయి.

కానీ ఒకప్పుడు తెలుగు సినిమా ఏదైనా సూపర్ హిట్ అయిందంటే చాలు ఇతర భాషల హీరోలు మన సినిమాలు చేయడానికి ఎగబడేవారు. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు ఎక్కువగా మన సినిమాలనే ఇష్టపడేవారు. అందుకే యూట్యూబ్ లో డబ్బింగ్ సినిమాల సంస్కృతి పెరిగిపోయింది. ప్రేక్షకుల ఆసక్తిని గమనించిన కొంతమంది దాన్ని క్యాష్ చేసుకోవడానికి మన తెలుగు సినిమాలను వివిధ భాషల్లోకి డబ్ చేసి యూట్యూబ్లో విడుదల చేసి కోట్ల కొద్దీ వ్యూస్ అందుకునేవారు. అది టాలీవుడ్ సినిమా పరిశ్రమకు బాగా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. మన హీరోలకు కొద్దోగొప్పో ఇమేజ్ దక్కింది ఈ విధంగానే.

ఆ ఇమేజ్ తోనే బాలీవుడ్ లో మన హీరోలకు అభిమానులు ఏర్పడ్డారు. అలా ప్రేక్షకుల సపోర్ట్ మనకు ఉంది కాబట్టే అక్కడ కూడా మన సినిమాలు డైరెక్ట్ గా విడుదల అవుతున్నాయి.  ఇప్పటికే కొంతమంది టాలీవుడ్ హీరోలకు అక్కడ మంచి అభిమానం ఉంది. అందుకే వారు హిందీలో కూడా సినిమాలు చేయగలుగుతున్నారు. ఏదేమైనా అక్కడ కూడా మన టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ ప్రేక్షకుల సపోర్ట్ ఉండడం వల్లనే ఇది సాధ్యం అవుతుంది అని చెప్పాలి. బాలీవుడ్ హీరోలకు ఇది ఎంతవరకు నచ్చుతుందో తెలియదు కానీ నిజంగా ఇది టాలీవుడ్ హీరోలకు పండగ లాంటి న్యూస్ అని చెప్పాలి. భవిష్యత్తులో మన హీరోలు ఇంకా ఏ ఏ ఇండస్ట్రీలను టార్గెట్ గా చేసుకొని సినిమాలు చేస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: